Begin typing your search above and press return to search.
రెండోసారి రెండుసార్లు కాళ్లకు దండం
By: Tupaki Desk | 6 July 2015 4:27 AM GMTబెట్టు చూపించాలన్నా.. తల వంచి ప్రేమాభిమానాలు కురిపించాలన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ముఖం చూపించటానికి సైతం ఇష్టపడని మొండితనమే కాదు.. పెద్దోళ్ల మనసుల్ని దోచుకునేందుకు వంగి కాళ్లకు నమస్కారం పెట్టే సంస్కారం కేసీఆర్ సొంతం.
వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ను ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన సందర్భంగా పాదాభివందనం చేసి వార్తల్లోకి ఎక్కిన కేసీఆర్.. ఆదివారం యాదాద్రికి వచ్చిన సందర్భంగా ప్రణబ్‌కు రెండుసార్లు పాదాభివందనం చేసి ఆయన మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు.
యాదాద్రి పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ కాళ్లకు రెండుసార్లు మొక్కిన కేసీఆర్.. ఆయన మనసును మాగ్జిమం దోచుకున్నారనే భావన ఉంది. హెలికాఫ్టర్‌లోయాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి స్వాగతం పలికే సమయంలో ఒకసారి పాదాభివందనం చేసిన ఆయన.. తర్వాత మెమొంటో ఇచ్చిన సందర్భంలో మరోసారి వంగి కాళ్లకు నమస్కారం చేశారు.
మొత్తంగా ప్రణబ్ పర్యటన సమయంలో ముచ్చటగా మూడుసార్లు కేసీఆర్ పాదాభివందనం చేసినట్లుగా చెప్పొచ్చు. ఒక్కరోజు వ్యవధిలో రెండుసార్లు పాదాభివందనం చేసిన ఆయన.. ప్రణబ్‌కు గవర్నర్ విందు ఇచ్చిన సందర్భంలో అనారోగ్యం అంటూ డుమ్మా కొట్టిన దానికి తాజా పాదాభివందనాలు సరిపోతాయన్న లెక్కలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రపతికి వరుస దండాలతో ఆయన మనసులో ప్రత్యేక స్థానం సంపాదించారన్న భావన వ్యక్తమవుతోంది.