Begin typing your search above and press return to search.
ఆ మీడియాకు కేసీఆర్ అన్న కుమార్తె ఫోన్ కాల్?
By: Tupaki Desk | 1 Jun 2017 11:44 AM GMTచూస్తుంటే.. తెలంగాణ అధికారపక్షం ఏ రూట్లో అయితే పయనిస్తుందో.. ఆ రూట్లోనే పయనిస్తున్నట్లుంది తెలంగాణ బీజేపీ తీరు చూస్తుంటే. ఏదైనా రాజకీయ పక్షం పెద్ద కార్యక్రమం పెట్టుకున్నా.. వారికి చురుకు పుట్టే కార్యక్రమాన్ని డిజైన్ చేయటం టీఆర్ఎస్‌కు ఒక అలవాటు. ఆ మాటకు వస్తే.. ఇదేమీ ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిందేమీ కాదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నాటి నుంచే ఈ అలవాటు ఉంది. కాకుంటే.. అప్పట్లో ఇవేమీ పెద్దగా బయటకు రాలేదు. ఇప్పుడంటే సోషల్ మీడియా జోరు పెరిగిపోవటంతో.. చాలా విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి.
టీఆర్ ఎస్ వ్యవహారాన్ని పక్కన పెడితే.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్న కుమార్తె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెను కలకలాన్నే రేపుతోంది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఐదు గంటల పర్యటన కోసం హైదరాబాద్ కు వస్తున్న సంగతి తెలిసిందే.
తన తాజా పర్యటనలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిచనున్నారు రాహుల్. ఇదిలా ఉంటే.. ఆయన రావటానికి కొద్ది గంటల ముందు కేసీఆర్ అన్న కుమార్తె రమ్య ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఫోన్ చేశారు. తాను ఇంతకాలం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధిగా ఉన్నానని.. తాను ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లుగా సదరు ఛానల్ కు సమాచారం అందించినట్లుగా ఆ ఛానల్ ప్రకటించింది.
2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా తెలంగాణలో తమ సత్తా చాటాలని తహతహలాడుతోంది బీజేపీ. దక్షిణాదిన తెలంగాణతో తమ జైత్రయాత్రను షురూ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వేర్వేరు పార్టీల్లోని అసంతృప్త నేతల్ని దగ్గరకు తీసి.. పార్టీలో కీలకబాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లు పావులు కదుపుతున్న కమలనాథులకు.. తాజాగా కేసీఆర్ అన్న కుమార్తె రమ్య రూపంలో ఒక అవకాశం లభించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి అధినాయకత్వం తరలి వస్తున్న వేళ.. తమకు ఎదురైన షాక్ తో టీ కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/