Begin typing your search above and press return to search.
కేసీఆర్ కేబినెట్ భేటీ.. ఇవి ఎన్నికల కోసం నిర్ణయాలేనా?
By: Tupaki Desk | 12 Aug 2022 6:09 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆగస్టు 11 జరిగిన ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని, గ్రామ కంఠాల్లో ఇళ్ల నిర్మాణం, ప్రజా సమస్యలపై కమిటీ వేయాలని ఇలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా వీటిని పట్టించుకోని కేసీఆర్ సడెన్ గా ఇప్పుడు కొత్త పెన్షన్లు, ఇళ్లు అని హడావుడి చేయడం ఖచ్చితంగా ఎన్నికల కోసమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దాదాపు ఐదు గంటలకు పైగా జరిగిన కేబినెట్ భేటీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే కొత్తగా పది లక్షల ఆసరా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారని అంటున్నారు. ఈ పెన్షన్లతో తెలంగాణలో మొత్తం పెన్షన్లు 46 లక్షలకు చేరతాయని చెబుతున్నారు. అలాగే తెలంగాణలో 5,111 అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి, సరోజనిదేవి కంటి ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్లు, ఆయా ఆస్పత్రులకు అధునాతన సౌకర్యాల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నారు.
అదేవిధంగా వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాలు, తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాలు, షాబాద్ లో బండల పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 45 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
కాగా ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఇక, స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను కూడా విడుదల చేయనున్నారు.
కాగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ భేటీలో సమగ్ర చర్చ జరిగిందని సమాచారం. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయంలో 15.3 శాతం వృద్ధి నమోదైందని అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గినా వృద్ధిరేటు నమోదు ప్రశంసనీయమని సీఎం కేసీఆర్ అధికారులను అభినందించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితుల్లో కోతలు విధించారని, లేదంటే ఆదాయం పెరిగేదని, వృద్ధిరేటు 22 శాతం నమోదయ్యేదని అధికారులు ఈ సందర్భంగా కేసీఆర్‌కు తెలిపారు.
కాగా రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగ్బంధించి, ఇబ్బందులు సృష్టించి.. రాజకీయంగా లబ్ధిపొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేసీఆర్ మండిపడ్డట్టు చెబుతున్నారు. ఆర్థిక సహాయ నిరాకరణ సహా కేంద్రం పెడుతున్న ఇబ్బందులను ప్రజలకు వివరించాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారని సమాచారం. ఈ మేరకు బీజేపీ తీరును క్షేత్రస్థాయిలో ప్రజల్లోనే ఎండగట్టాలని నిర్ణయించారని తెలుస్తోంది.
కేంద్రం ఆర్థిక ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో రాజీవ్ స్వగృహ, గృహకల్ప ప్రాజెక్టులకు చెందిన ఇళ్లు, ఖాళీ స్థలాల విక్రయం ద్వారా ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. అదేవిధంగా కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలికి తరలించడం ద్వారా.. నగరంలో ఐదు వేల ఎకరాలు అందుబాటులోకి వస్తాయని కేబినెట్ భేటీలో అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించినట్టు తెలిసింది. దీంతో ఆ స్థలాలను రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవచ్చని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.