Begin typing your search above and press return to search.

ఇలాంటి కేబినెట్ స‌మావేశం కేసీఆర్‌ కే సాధ్యం

By:  Tupaki Desk   |   7 Jan 2019 7:53 AM GMT
ఇలాంటి కేబినెట్ స‌మావేశం కేసీఆర్‌ కే సాధ్యం
X
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జ‌రుగుతోంది! అవాక్క‌వ‌కండి. నిజంగానే జ‌రుగుతోంది. ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. హోంమంత్రి మహమూద్ అలీ - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి - ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలు - ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుని నామినేట్ - పార్లమెంటరీ కార్యదర్శుల నియమక ప్రక్రియపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు.

తెలంగాణ ఎన్నిక‌ల ఫలితాలు వెలువ‌డింది మొద‌లు నేటి వ‌ర‌కు అంద‌రి దృష్టి మంత్రి ప‌ద‌వులు ఎవ‌రెవ‌రికీ ద‌క్క‌నున్నాయ‌నే దానిపై ప‌డింది. సనసభ సమావేశాలు - ప్రొటెం స్పీకర్‌ - స్పీకర్‌ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు కావటంలో ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ కూర్పు పై ఆస‌క్తి మ‌రింత పెరిగింది. అలాంటి స‌మ‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించడం...అది కూడా త‌న‌తో పాటు మరో మంత్రితో మాత్ర‌మే సాగిస్తుండ‌టం...ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలాఉండగా, ఈనెల 18వ తేదీన్నే నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అవకాశముందని టీఆర్‌ ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో తొలి దఫా మంత్రివర్గానికి సంబంధించి పలువురి ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన వీరికి అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోపాటు హోం మంత్రి మహమూద్‌ అలీ కూడా ప్రమాణం చేసిన నేపథ్యంలో.. తొలి దఫాలో మరో నలుగురు లేదా ఐదుగురితో ప్రమాణం చేయించనున్నట్టు తెలుస్తున్నది.