Begin typing your search above and press return to search.
చండీయాగానికి స్థలాన్ని ఎంపిక చేశారు
By: Tupaki Desk | 3 Nov 2015 5:03 AM GMTడిసెంబరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ఆయుత చండీయగానికి సంబంధించి పనులు వేగంగా జరిగిపోతున్నాయి. చండీయాగానికి సంబంధించి కీలక కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలన్న దానిపై స్థలాన్ని ఎంపిక చేయటం పూర్తి అయ్యింది. యాగానికి అవసరమైన స్థలాన్ని గుర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా తన ఫాంహౌస్ లో వేద పండితుల్ని వెంట పెట్టుకొని వెళ్లారు. పలు స్థలాల్ని చూసిన తర్వాత.. క్షేత్రం ప్రధాన ద్వారం ముందు పంటలు లేకుండా ఖాళీగా ఉన్న స్థలంలో యాగం చేయాలని నిర్ణయించారు.
దాదాపు గంట పాటు స్థలం ఎంపిక కోసం సమాయాన్ని వెచ్చించిన కేసీఆర్.. చివరకు యాగానికి అవసరమైన స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక.. బ్రాహ్మణులు.. రక్షణ సిబ్బంది.. అతిధులకు అవసరమైన వసతి కోసం పెద్ద ఎత్తున తాత్కిలిక గుడారాల్ని ఏర్పాటు చేయనున్నారు. చండీయాగానికి దేశ రాష్ట్రపతి వస్తున్న సంగతి తెలిసిందే. చండీయాగానికి దాదాపు 30 ఎకరాల స్థలాన్ని వినియోగించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ అందరూ అనుకున్నట్లు అయుత చండీయాగం తన ఫాంహౌస్ లో కాకుండా.. దాని ఎదురుగా ఉన్న పంట పొలాల్లో నిర్వహించాలని నిర్ణయించటం గమనార్హం.