Begin typing your search above and press return to search.

వెంకయ్య ఇచ్చాడు-చంద్రబాబు తీసుకున్నాడు​

By:  Tupaki Desk   |   31 Jan 2016 5:46 AM GMT
వెంకయ్య ఇచ్చాడు-చంద్రబాబు తీసుకున్నాడు​
X
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ మాగ్జిమం ఓట్లు రాబట్టుకోవడానికి మాటలకు మరింత పదును పెట్టింది. ముఖ్యంగా కేసీఆర్ తన మాటలతో మరింత వేడిని రగిలిస్తున్నాడు. ఏపీ సీఎంకు ఇక్కడేంపని అంటూ మీడియా ముందు విమర్శించిన కేసీఆర్.. ఇసారి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కూడా వదల్లేదు. గతంలో తెలంగాణా పోలీసులకు అందించిన ఇన్నోవాలన్నీ వెంకయ్యనాయుడు కుమారుడు హర్షా షోరూం నుంచే కొనుగోలు చేశారు. వెంకయ్యనాయుడు - కేసీఆర్ బాగా క్లోజ్ అయ్యారనే ప్రచారం జరిగింది. అంతెందుకు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఇసారి నామమాత్రంగానే నిలబడాలని తెలుగుదేశం - భాజపా అనుకున్నాయనే ప్రచారం మొన్నటి వరకు జరిగింది. మీడియా మొఘల్ రామోజీరావే ఇసారికి జీహెచ్ ఎంసీ పీఠాన్ని టీఆర్ ఎస్ కే వదిలేయండని చంద్రబాబు - వెంకయ్యనాయుడులను కోరాడని.. అందుకే చాలా చోట్ల టీడీపీ - బి.జె.పి. డమ్మీ అభ్యర్థులను పెట్టిందనే ప్రచారం జరిగింది. ఏకంగా లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణే తెలుగుదేశానికి ఓటేస్తే.. టీఆర్ ఎస్ కు వేసినట్టే అని ఎన్నికల ప్రచారం సందర్భంగా విమర్శించారు. దాంతో వెంకయ్యనాయుడు - చంద్రబాబు - కేసీఆర్ ఒక్కటయ్యారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. మరి గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే... కేసీఆర్ మరోసారి చంద్రబాబు - బి.జె.పి.నాయకులను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నాడు. ఈ రోజు జరిగిన బహిరంగసభలోనైతే... తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని.. ఏదైనా చేసిందంటే.. అది మన వద్ద వున్న ఏడు మండలాలను తీసుకుని పోయి వెంకయ్యనా​యు​డు... చంద్రబాబు చేతిలో పెట్టాడని. ఇంతకు మించి వారు చేసిందేమీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. స్మార్ట్ సిటీల విషయంలోనూ భాజపాను దోషిని చేసి విమర్శించిన కేసీఆర్ కు... అసలు స్మార్ట్ సిటీలు రాక​​పోవడానికి అసలు కారకుడు కేసీఆర్ అని మీడియా ముందు విపులంగా వివరిస్తున్నారు బి.జె.పి నాయకులు. మరి చూడాలి.. నేడు ప్రచారానికి చివరి రోజు. ఈ రోజు ఇంకెంత విమర్శించుకుని ఓటర్లను రాబట్టుకుంటారో?

అంటే సీమాంధ్రులను ఆకర్షించడానికి, వారి మనసులను మార్చడానికే టీఆర్ ఎస్ నాయకులే టీఆర్ ఎస్-టీడీపీ కుమ్మక్కయినట్లు ప్రచారం చేయడం, అది నిజమన్నట్లుగా కేటీఆర్ సీఎంలిద్దరూ కలిసిపోయారనడం ఒక వ్యూహం ప్రకారం చేశారు. చంద్రబాబు రెండ్రోజుల సుడిగాలి పర్యటనలతో ఈ కుట్రను పటాపంచలు చేశాడు.