Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ పై రూటు మార్చిన కేసీఆర్
By: Tupaki Desk | 30 May 2019 5:29 AM GMTపార్లమెంట్ ఎన్నికలకు ముందు వరకూ ‘ఆపరేషన్ సీఎల్పీ’ అమలు చేసిన కేసీఆర్ ఎన్నికల వేళ దాన్ని నిలిపివేశారు. కేంద్రంలో హంగ్ వస్తే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సి వస్తుందని కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ ఎస్ లో విలీనం చేయకుండా బ్రేక్ వేశారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కితే కాంగ్రెస్ శాసనసభాపక్షమే తెలంగాణ అసెంబ్లీలో ఉండదు. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగిసినా కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ విలీనాన్ని చేయడం లేదు.. దీనివెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. మరో ఇద్దరు చేరితే కాంగ్రెస్ ఖేల్ ఖతమే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి - పోడం వీరయ్యలను టీఆర్ ఎస్ లో చేర్చుకోవాలని ఎన్నికలకు ముందు చర్చలు జరిగాయి. అయితే లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎల్పీ విలీన వ్యూహాన్ని కేసీఆర్ మార్చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ దెబ్బకొట్టిన అసమ్మతి - మెజార్టీ ఇచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగడంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చినట్టు తెలిసింది.
అందుకే ఇప్పుడు సీఎల్పీ విలీనం చేసుకున్నా టీఆర్ ఎస్ కు వచ్చే రాజకీయ ప్రయోజనం శూన్యం. కానీ దీనిపై కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లి రచ్చరచ్చ చేసే అవకాశముంది. అందుకే దీనికి ఆస్కారం ఇవ్వకూడదనే కేసీఆర్ సీఎల్పీ విలీనాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు గెలవడం.. క్షేత్రస్థాయిలో టీఆర్ ఎస్ కు వ్యతిరేక పవనాలు వీయడంతో ముందుగా పార్టీపై దృష్టిపెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం.అందుకే ప్రస్తుతానికి విలీనం ఎపిసోడ్ కు విరామం ప్రకటించినట్టు తెలుస్తోంది.