Begin typing your search above and press return to search.

గోల్కొండ‌కు గుడ్ బై చెప్పేసిన సారు..కొత్త వెన్యూ ఇదే!

By:  Tupaki Desk   |   18 May 2019 4:28 AM GMT
గోల్కొండ‌కు గుడ్ బై చెప్పేసిన సారు..కొత్త వెన్యూ ఇదే!
X
కీల‌క నిర్ణ‌యాల్ని తీసుకోవ‌టంతో త‌న మార్క్ ప్ర‌ద‌ర్శించే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా అదే తీరుతో మ‌రోసారి వ్య‌వ‌హ‌రించారు. జూన్ 2న నిర్వ‌హించే రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం.. స్వాతంత్య్ర దినోత్స‌వం..రిప‌బ్లిక్ డేల‌ను గోల్కొండ త‌దిత‌ర ప్రాంతాల్లో నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇక‌పై ఈ మూడు కార్య‌క్ర‌మాల‌కు వెన్యూ మార్చేసే ఆయ‌న ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

రానున్న జూన్ 2న నిర్వ‌హించే రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్స్ లోని మైదానంలో నిర్వ‌హించాల‌ని కేసీఆర్ డిసైడ్ చేశారు. ఇందుకోసం జూబ్లీహాలు ఎదురుగా ఉన్న స్థ‌లాన్ని ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం గోల్కొండ కోట‌లో నిర్వ‌హిస్తున్న మూడు ఉత్స‌వాల్ని..రానున్న రోజుల్లో ప‌బ్లిక్ గార్డెన్ లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఎందుకిలా? కార‌ణం ఏమిటి? అన్న‌ది చూస్తే.. గోల్కొండ కోట దూరంగా ఉండ‌టం.. కొద్ది మందిని త‌ప్పించి.. అంద‌రికి అందుబాటులో లేక‌పోవ‌టంతో తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడ‌టంతో పాటు.. మ‌రింత వైభ‌వంగా కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఈ మూడు వేడుక‌ల‌కు సంబంధించి మ‌రో రెండు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అందులో ఒక‌టి.. పోలీసుల క‌వాతును నిర్వ‌హించే సంప్ర‌దాయానికి గుడ్ బై చెప్ప‌టంతో పాటు.. మూడు ఉత్స‌వాల‌కు విద్యార్థుల్ని తీసుకొచ్చే విధానానికి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించారు.

ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచేలా ఈ మూడు ఉత్స‌వాల్ని నిర్వ‌హిస్తూ.. పోలీసుల యాత‌న అన్న‌ది లేకుండా చేయాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. రాష్ట్ర పండ‌గ‌ల‌పై నిర్వ‌హ‌ణ‌కు అనుస‌రించాల్సిన ప‌ద్ద‌తుల‌పై తాజాగా ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో స‌మీక్ష నిర్వ‌హించిన ఆయ‌న‌.. స‌రికొత్త నిర్ణ‌యాల్ని తీసుకున్నారు. మూడు ఉత్స‌వాల సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు బ‌ల‌గాల్ని పిలిపించి ఎండ‌లో క‌వాతు చేయించ‌టం.. విద్యార్థుల్ని ర‌ప్పించి ఇబ్బందుల‌కు గురి చేయ‌టం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన కేసీఆర్ కు అంద‌రూ అవున‌ని చెప్ప‌టంతో.. కొత్త నిర్ణ‌యాన్ని తీసేసుకున్నారు. తాజా నిర్ణ‌యంతో రోటీన్ కు భిన్నంగా రాష్ట్రంలో మూడు ముఖ్య‌మైన ఉత్స‌వాలు కేసీఆర్ మార్క్ తో ఇక‌పై జ‌ర‌గ‌నున్నాయ్. ఆల్ ద బెస్ట్ కేసీఆర్!