Begin typing your search above and press return to search.
మోడీ సలహాతోనే ఆ పనిచేశానంటున్న కేసీఆర్
By: Tupaki Desk | 28 Dec 2016 1:50 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కలల ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయించుకోగలిగారు. తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్లు రైతులకు మెరుగైన పరిహారం ఇచ్చేందుకు రూపొందించిన తెలంగాణ భూసేకరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. నీటిపారుదల మంత్రి హరీష్ రావు బిల్లును సభలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును సభ ఆమోదించింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలను సీఎం కేసీఆర్ - నీటిపారుదల మంత్రి హరీశ్ రావ్ నివృత్తి చేశారు. సభ్యుల హర్షధ్వానాల మధ్య స్పీకర్ బిల్లును ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన 2013 భూసేకరణ చట్టంలో ఎన్నో లోపాలున్నాయని, వాటి వల్ల తెలంగాణ రాష్ట్ర రైతులు నష్టపోయే అవకాశమున్నందున రాజ్యాంగం కల్పించిన హక్కు 254 ఆర్టికల్ ప్రకారం తెలంగాణ సొంతంగా భూసేకరణ చట్టాన్ని రూపొందించి ఇవాళ సభ ముందుంచింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సూచన మేరకే ఈ చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఇదేవిధంగా దేశంలోని రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - తమిళనాడుతో పాటు ఇతర రాష్ర్టాలు తమకు అనుగుణంగా, తమ ప్రజలకు మేలు జరిగే విధంగా చట్టాలను తయారు చేసుకున్నాయని సీఎం కేసీఆర్ సభలో వివరించారు. ప్రజలకు మెరుగైన సాయం అందించడానికి జీఓ నెంబర్ 123 ని తీసుకొస్తే ప్రతిపక్షాలు నానా రాద్దాంతం చేశాయని, ప్రజలకు తప్పుడు సమాచారాన్ని నూరిపోసి, జీఓ మీద కోర్టులకు వెళ్లి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేశాయని కేసీఆర్ వెల్లడించారు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికే తెలంగాణ రాష్ట్రం భూసేకరణ చట్టాన్ని రూపొందించిందని వివరించారు. కొత్త చట్టం ప్రకారం రైతులకు గతంలోకంటే మెరుగైన సాయం అందటమే గాక, పరిహారం ఏళ్లకు ఏళ్లు పెండింగ్ పడకుండా తక్షణ సాయం అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తమ చట్టం వల్ల నిర్వాసితులకు కలిగే లాభాలను క్షుణ్ణంగా వివరిస్తూ...అదేసమయంలో 2013 చట్టం వల్ల రైతులకు ఎలాంటి నష్టం కలుగుతుందో కేసీఆర్ విశ్లేషించారు. భూసేకరణ చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 254 ప్రకారం సంపూర్ణ అధికారం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై ప్రతిపకాలు చేస్తున్న రాద్దాంతాన్ని సీఎం తప్పుపట్టారు. భావితరాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే కొంత నష్టం జరగడం వాస్తవమని సీఎం అన్నారు. భూసేకరణ చేయకుండా ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టలేదని కేసీఆర్ అన్నారు. భూసేకరణ చేయకుండానే నాగార్జునసాగర్ - శ్రీశైలం - ఎస్సారెస్పీ ప్రాజెక్టులు కట్టారా? అని కేసీఆర్ నిలదీశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం స్పష్టం చేశారు.బహుళార్ధక సాధక ప్రాజెక్టులు కట్టినప్పుడు కొంత నష్టం జరగక తప్పదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూసేకరణ విషయంలో విపక్షాల రభస అంతా ఇంతా కాదని... ప్రపంచంలో ఏ సమస్య లేనట్టు విపక్షాలు మల్లన్నసాగర్ మీదనే పడ్డాయని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ కు 75 శాతం మంది ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని గుర్తు చేశారు. సీపీఎం నేతలు రైతులను రెచ్చగొట్టారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆ పార్టీకి దిక్కుమాలిన స్ట్రాటజీలు ఉంటాయి, ప్రజల ప్రాణాలను సైతం ఫణంగా పెడుతారు సీపీఎం పార్టీలు వాళ్లు అంటూ కోపోద్రిక్తులయ్యారు. పోలీసులను సూదులు - దబ్బడాలతో కుచ్చి రెచ్చగొడుతారని కేసీఆర్ వివరించారు. స్థానిక రైతులు మాత్రం మల్లన్నసాగర్ కు అనుకూలంగానే ఉన్నారని తెలిపారు. అల్లర్లు లేపి ప్రాజెక్టులను అడ్డుకోవాలనేదే ప్రతిపక్షాల ప్రధాన కుట్ర అని ధ్వజమెత్తారు. గతంలో జరిగిన నష్టాన్ని త్వరగా పూడ్చాలనేది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/