Begin typing your search above and press return to search.
పటిష్టమైన టెక్నాలజీతో కేసీఆర్ కలల ప్రాజెక్టు
By: Tupaki Desk | 7 Nov 2017 11:13 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ తన కలలను ఎంత రిచ్ గా నెరవేర్చుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆచరణ సాధ్యం కాదు అని ఇతరులు అనుకున్న వాటిని కూడా అమల్లో పెట్టేయడం కేసీఆర్ మార్క్ స్టైల్. అది సచివాలయం నిర్మాణం అయినా...మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులయినా..కేసీఆర్ అన్నమాట నెగ్గించుకుంటారు. అలాగే కేసీఆర్ చేపట్టిన మరో సంచలనాత్మక ప్రాజెక్టు భూ రికార్డుల ప్రక్షాళన. తెలంగాణలో సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న భూముల రికార్డులను చక్కదిద్ది దారిలో పెట్టేయడం ఈ లక్ష్యం. అయితే ఈ సందర్భంగా కొత్త రికార్డును నెలకొల్పేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. స్వయంగా ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు.
శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 445 తహసీల్దార్ కార్యాలయాలకు సబ్ రిజిస్ట్రార్ అధికారాలు ఇస్తామని స్పష్టం చేశారు. 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలను యథాతథంగా కొనసాగిస్తామని సీఎం తెలిపారు. తహసీల్దార్లకు మ్యుటేషన్ అధికారం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి రెవెన్యూ కార్యాలయంలో ఐటీ అధికారులను నియమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఒకసారి వెళ్తే సరిపోతుందన్నారు. భూముల క్రయ - విక్రయాల వివరాలు ఒక్క రోజులోనే ఆన్ లైన్ లో తెలవాలని సీఎం చెప్పారు. కోర్ బ్యాంకింగ్ నెట్ వర్క్ మాదిరిగా భూముల వివరాలు తెలుస్తాయన్నారు.
గతంలో మాదిరిగా పాస్ బుక్స్ ఉండవని...పాస్ పోర్టు తరహాలో పటిష్టంగా పాస్ బుక్స్ ఉంటాయని కేసీఆర్ అన్నారు. కొత్తగా వచ్చే పట్టాదారు పుస్తకాలు నెల రోజులు నీటిలో పడేసిన ఏం కాదని...వాటర్ ప్రూఫ్ తో ఉంటుందన్నారు. ప్రత్యేకమైన పెన్నుతో రాస్తేనే దానిపై పడుతుందన్నారు. ఇష్టమొచ్చిన పెన్నుతో రాస్తే దానిపై పడదన్నారు. సంబంధిత అధికారులకు కేటాయించిన స్పెషల్ పెన్నులతోనే ఆ పాస్ బుక్స్ పై రాసేందుకు వీలు ఉంటుందన్నారు. కొత్త పాస్ బుక్ లను 26 సెఫ్టీ ఫీచర్లతో రూపకల్పన చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతి రైతుకు ఒక సర్వే నంబర్ కేటాయించాలనేది తన ప్రతిపాదన అని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్నా.. ఒకే సర్వే నంబర్ ఇస్తే బాగుంటుందని చెప్పారు. రైతులకు పాస్ పుస్తకాలు కొరియర్ ద్వారా ఇంటికి చేరేలా చేస్తామని సీఎం తెలిపారు.