Begin typing your search above and press return to search.

కాంగ్రెసోళ్ల బుట్టలో పడని కేసీఆర్

By:  Tupaki Desk   |   15 March 2017 2:08 PM GMT
కాంగ్రెసోళ్ల బుట్టలో పడని కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మామూలోరు కాదు. ఆయన్ను తక్కువగా అంచనా వేసినోళ్లంతా ఇప్పటికేపలుమార్లు బొక్కబోర్లా పడ్డారు. అయినప్పటికీ ఆయన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్లుగా ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు చూస్తే. నిర్మాణాత్మక వాదనలతో.. వాస్తవ గణాంకాలతో కేసీఆర్ చెప్పే మాటల్లో డొల్లతనాన్ని చూపించే ప్రయత్నం చేసి.. ఆయన్ను డిఫెన్స్ లో పడేయాలే తప్పించి.. ఆయన్ను కవ్వించాలన్న ప్రయత్నం ఎంత పిచ్చి పని అవుతుందో తాజా ఉదంతం చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటూ వస్తున్న కథనాలపై తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. మధ్యంతరానికి వెళుతున్నట్లుగా హామీల బడ్జెట్లను ప్రవేశపెడుతున్నారని.. ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ అండ్ కోలు చేస్తున్న మాటలకు పర్మినెంట్ చెక్ పెట్టే పని చేశారు కేసీఆర్.

ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత తెలివితక్కువ పని తాను చేయనన్న విషయాన్ని తనదైన శైలిలో స్పష్టం చేసిన కసీఆర్.. ముందస్తు ఎన్నికలపై వస్తున్న కథనాల్లో నిజంలేదని..ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చేశారు. శాసనమండలిలో మాట్లాడిన కేసీఆర్.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయే తప్పించి.. ముందుగా జరిగే అవకాశమే లేదన్నారు. ఉద్యమ సమయంలో మాదిరి ఎన్నికల ముచ్చటను తెర మీదకుతీసుకు వచ్చిన వెంటనే ఆవేశంతో ఎన్నికలకు సిద్ధమనటానికి ఆయనేమీ ఉద్యమ నేత కాదని.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారన్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గుర్తిస్తే బాగుంటుంది. ఎన్నికల మాటలతో తమ బుట్టలో వేయటానికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు.. మళ్లీ ముందస్తు ముచ్చట తీసుకురాని రీతిలో సమాధానం చెప్పారని చెప్పాలి.