Begin typing your search above and press return to search.
గెలిస్తే కేసీఆర్ బొమ్మతోనే ...!!
By: Tupaki Desk | 25 Sep 2018 5:54 AM GMTముందస్తు ఎన్నికలతో తెలంగాణలో రాజకీయ వేడి రగిల్చిన కేసీఆర్ తన పార్టీ అభ్యర్థుల విజయానికి తాను తప్ప ఇంకో ఫ్యాక్టర్ కారణం కారాదని అనుకుంటున్నారట. ఎవరైనా సరే కేసీఆర్ అన్న ఇమేజితోనే గెలవాలి కానీ ఇంకే ప్రభావం ఉండరాదని భావిస్తున్నారట. అప్పుడే గెలిచినవారంతా తోక ముడుచుకుని తన వెనుక ఉంటారని.. లేకపోతే.. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురైనా కూడా తోక జాడించే ప్రమాదముందని ఆయన భావిస్తున్నారట. అందుకే.... ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులంతా తమతమ నియోజకవర్గాల్లో ప్రచారానికే పరిమితం కావాలి కానీ... ఇతర నియోజకవర్గాల్లో కూడా ప్రచారానికి వెళ్లరాదని ఆదేశించారట. మరీ, ముఖ్యంగా... మంత్రులు తమ చుట్టుపట్ల ఉన్న రెండు మూడు నియోజకవర్గాల్లో అంతోఇంతో పట్టుంటుంది కాబట్టి అక్కడకూ వెళ్లే అవకాశం ఉంటుందని.. కానీ, అలాంటి పని ఎంతమాత్రం చేయొద్దని కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
పాత జిల్లాలను పరిగణలోకి తీసుకుంటే ప్రతి జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు మంత్రులు ఉన్నారు. వారు మంత్రులు కాబట్టి సహజంగానే ఉమ్మడి జిల్లా పరిధిలో తమ నాయకత్వం చెలామణి కావాలని కోరుకుంటారు. కానీ మంత్రులెవరైనా సరే సొంత నియోజకవర్గం దాటి బయట కాలు పెట్టడానికి వీలు లేదని కేసీఆర్ క్లియర్ గా చెప్పారని టాక్. ఇలాంటి ఆదేశాలు జారీ కావడం వెనుక రెండు బలమైన కారణాలు ఉన్నాయన్న చర్చ జరుగుతున్నది. తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నవారిలో చాలామందిపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు కేసీఆర్ కు సమాచారం ఉందంటున్నారు. సర్వే ఫలితాల్లో కొందరికి మరీ పూర్ అని వచ్చిందని చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో మంత్రులుగా ఉన్నవారే ఓడిపోతే ప్రతిష్టకు మచ్చ వస్తుందన్న ఉద్దేశంతోనే కేసిఆర్ ముందు సొంత ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఉద్దేశంతో ఈ రకమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.
అలాగే.... టిఆర్ ఎస్ పార్టీలో అందరూ కేసిఆర్ బొమ్మతోనే గెలవాలన్న ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. మేము మంత్రులుగా ఉండి జిల్లాలో గెలిపించాము అన్న క్రెడిట్ ఎవరూ కొట్టేయకుండా ఉండేందుకు ఇదొక స్ట్రాటజీ అని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు - మంత్రులు ఎవరికి వారు సొంతంగా గెలవాలి. అలాగే అధినేత కేసిఆర్ ఆశిస్సులతో గెలవాలి తప్ప మధ్యలో మంత్రులు గెలిపించారు. ఇంకొకరు గెలిపించారు అన్న చర్చకు తావు లేకుండా ఉండేందుకు ఈ రకమైన ఆదేశాలు జారీ అయినట్లు పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. భవిష్యత్తులో ఎవరైనా తిరుగుబాటు వంటిది చేసినా వారి వెంట ఎవరూ వెళ్లకుండా తన వెంట ఉండేలా చేసుకునేందుకు ఈ వ్యూహం అమలు చేస్తున్నారని భావిస్తున్నారు.