Begin typing your search above and press return to search.
అమరుడి కుటుంబానికి ఓదార్పు: 22న సూర్యాపేటకు సీఎం కేసీఆర్
By: Tupaki Desk | 20 Jun 2020 4:30 PM GMTగల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోశ్ బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన సూర్యాపేట పర్యటన ఖరారైంది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం ప్రకటించారు. సూర్యాపేటలో సంతోశ్ బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సంతోశ్ బాబు సేవలు యువతకు స్ఫూర్తిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని, అందుకే ఆ కుటుంబానికి రూ.5 కోట్ల సహాయం, హైదరాబాద్‌లో 600 గజాల ఇంటిస్థలం, సంతోశ్‌బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు వివరించారు. ప్రభుత్వ సహాయం స్వయంగా వచ్చి ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారని, అందులో భాగంగా సోమవారం (జూన్ 22)న సూర్యాపేటకు సీఎం కేసీఆర్ రానున్నారని ప్రకటించారు.
సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ స్వయంగా సూర్యాపేటలోని సంతోశ్ బాబు నివాసానికి వస్తారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. సంతోశ్ బాబు కుటుంబసభ్యులను ఓదార్చి ప్రభుత్వ సహాయం అందిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనపై సంతోశ్ బాబు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు.