Begin typing your search above and press return to search.
ఏపీ మంత్రి కసి పెంచుకునేలా కేసీఆర్ ఏమన్నాడు?
By: Tupaki Desk | 30 Oct 2019 11:00 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ కి ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకాలు చేస్తున్నారు. అదేంటి గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోలేదు..అలాగే అందరి ఉద్యోగాలు కూడా ఊడగొట్టాడు. ఈ సమయంలో కేసీఆర్ కి పాలాభిషేకాలు ఏమిటా అని అనుకుంటున్నారా .. కేసీఆర్ కి పాలాభిషేకాలు చేసేది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కాదు.. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు. కేసీఆర్ నోటి వెంట వచ్చిన ఒక మాట ఇప్పుడు ఏపీ ఆర్టీసీ కార్మికులకు వరంగా మారింది. అదేమిటంటే .. కేసీఆర్ ఆర్టీసీ సమ్మె పై మాట్లాడుతూ ..ఆర్టీసీని ప్రభుత్వం లో కలపలేము అని చెప్పారు. అదే సమయంలో ఏపీలో ఆర్టీసీ విలీనం చేస్తున్నారు కదా అని అడగ్గా ..సీఎం కేసీఆర్ రెచ్చిపోయి అది నామ మాత్రమే అని - ఐదారు నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయలేము అని చేతులెత్తేస్తారు మాట్లాడారు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ..సీఎం కేసీఆర్ ఆలా మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆర్టీసీ విలీనం పై ఏపీ ప్రభుత్వం మరో అడుగుముందుకు వేసింది. ఇక తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని ఆర్టీసీ విలీనం పై మాట్లాడుతూ ..వచ్చే ఆరు నెలలోపే కచ్చితంగా విలీన హామీని నెరవేరుస్తామని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచనతో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పామని.. ఆ హమీని అమలు చేసి తీరాలన్న పట్టుదల పెరిగిందన్నారు.
వ్యవస్థల్ని ప్రవేట్ పరం చేస్తున్న రోజుల్లో.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప నిర్ణయమని - ఇక ఏపీలో ఆర్టీసీ విలీనంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై తనదైన రీతిలో మాట్లాడుతూ .. సీఎం కేసీఆర్ మాట్లాడిన తరువాత ఆర్టీసీని విలీనంఫై మాకు కసి పెరిగింది అని చెప్పారు. అలాగే సీఎం కేసీఆర్ మాటలని మేము పాజిటివ్ గానే తీసుకున్నాం అని తెలిపారు. ఏదేమైనా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్పటికి విమర్శలుగా మిగిలినా కూడా ఏపీ ఆర్టీసీ కార్మికులకు వరంగా మారాయి అని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ కి గట్టి కౌంటర్ ఇవ్వాలి అంటే ఏపీలో ఆర్టీసీ ని విలీనం చేయాల్సిందే ..ఇదే కసితో ఏపీ ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే .. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ కి గుడి కట్టించినా కట్టిస్తారు.