Begin typing your search above and press return to search.
పార్టీ మారి వచ్చినోళ్లకు కేసీఆర్ భారీ పంచ్
By: Tupaki Desk | 8 March 2020 4:30 AM GMTకారణం ఏదైనా కావొచ్చు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి చెందిన నేత మరో పార్టీలో చేరటం అంత తేలికైన విషయం కాదు. గతంలో పార్టీ మారటం అంటే.. మరో పెళ్లి చేసుకున్నంత పెద్ద విషయంగా ఉండేది. మారిన కాలానికి తగ్గట్లుగా ఇప్పుడు పరిస్థితుల్లో చాలానే మార్పు వచ్చింది. పవర్ ఎక్కడ ఉంటే అక్కడకు జంప్ కావటం.. పార్టీ మారటం అన్నది చొక్కా.. ప్యాంటు మార్చుకున్నంత సింఫుల్ గా మారింది.
ఒక నేత పార్టీ మారటం బయటకు కనిపించే విషయమే కానీ.. తెర చాటున చాలానే జరుగుతుంది. అందుకు సంబంధించిన వివరాలు క్వశ్చన్ మార్కుతోనో.. విమర్శలు.. ఆరోపణల రూపంలో బయటకు రావటమే తప్పించి.. నిజం ఇదన్నట్లుగా రాదు. కొన్ని కమిట్ మెంట్లు.. అంతుకు మించిన ప్రయోజనాలు.. మొత్తంగా విన్ టు విన్ ఫార్ములా నేతలు పార్టీ మారటం వెనుక కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది.
ప్రజాస్వామ్య భారతంలో పార్టీ మారి తమ చెంతకు వచ్చినోళ్లను పల్లెత్తు మాట అనని అధినేతలే కనిపిస్తారు. అందరిలా ఉంటే కేసీఆర్ గొప్పతనం ఏముంటుంది చెప్పండి. అందుకే కాబోలు.. ఆయన తన మార్క్ ఏమిటో చూపించేశారు. పార్టీ మారి తమ పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు సంచలనంగా మారాయి. నిజానికి.. పార్టీ మారి వచ్చినోళ్లకు భారీ పంచ్ వేయటమే కాదు.. వారి మనసులు చివుక్కుమనేలా ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి.
ఒక వ్యక్తి పార్టీ మారటం.. కొంతమంది ప్రజాప్రతినిధులు పార్టీ మారటం వెనుక ఉన్న లెక్కల్ని ఓపెన్ గా ప్రస్తావించని కేసీఆర్.. అందులో ఉన్న అడ్వాంటేజ్ ను వాడేసుకున్న వైనం చూస్తే.. జుట్టున్నమ్మ ఎలాంటి కొప్పునైనా పెట్టుకుంటుందన్న సామెతను తలపించేలా తన మాటల మాయాజాలాన్ని ప్రదర్శించారని చెప్పాలి. ‘‘ఎన్నికల తర్వాత కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీతో కలిసి పని చేస్తామని మాతో చెప్పారు. తొలుత నేను నిరాకరించాను. అంగీకరించలేదు. మాపై లేనిపోని బద్‌నామ్‌లు వస్తయి. ఇంత గెలుపు గెలిచి.. చిల్లర విమర్శలకు గురి కావాల్సి ఉంటుందని తీసుకోలేదు. అయినా.. మేం పని చేయాలనుకుంటున్నామన్నారు. మా పార్టీ మంత్రులు కూడా వచ్చి చెబితే వద్దు అన్న. రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగా మూడింట రెండొంతుల మంది వస్తే ఏ ప్రాబ్లమ్ లేదన్నాం. సమయం తీసుకొని టూ థర్డ్‌గా వచ్చారు. విలీనం అయ్యారు’’ అని చెప్పుకొచ్చిన వైనం చూస్తే.. తమకు తామే అదే పనిగా వెంట పడి తమ పార్టీలోకి వచ్చినట్లుగా కేసీఆర్ వ్యాఖ్యానించటం విశేషం.
పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చి చేరిన వైనాన్ని సీఎం కేసీఆర్ ఎంతలా సమర్థించుకున్నారన్నది చూస్తే.. ఆశ్చర్యపోవటం ఖాయం. ఇంతకాలం పార్టీని చీల్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు.. తమకు చేతకానిది.. కేసీఆర్ మాత్రమే చేతనైనది ఏమిటో ఆయన తాజా వ్యాఖ్యలు చెప్పకనే చెప్పేస్తాయని చెప్పాలి. ‘‘ఇద్దరినో ముగ్గురినో కలుపుకొంటే తప్పు. అలా కాకుండా ఒక పార్టీ వచ్చిన విలీనం చేసుకోవాలని కోరితే భారతదేశంలో ఏ పార్టీ అయినా చేర్చుకోదా? ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం టీడీపీ సభ్యుల్ని డామ్మున మింగింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ కూడా కలుపుకుంది. కాంగ్రెస్ పార్టీని నేను చీల్చలేదు. వాళ్లే వచ్చి చేరారు’’ అని వ్యాఖ్యానించారు. అంతేనా.. పార్టీ మారి వచ్చిన వారి విషయంలో అదే పనిగా ప్రశ్నించటం ఏమిటని ఫైర్ అవుతూ.. అలాంటి వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్న సంకేతాల్ని ఇచ్చేయటం గమనార్హం.
‘‘వాళ్లు టూ థర్డ్ గా వచ్చారు. మీ (స్పీకర్) నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి కూడా రాకూడదు. ఈ అంశంలో మీపై చేసిన ఆరోపణల్ని పరిశీలించాలి. మాటిమాటికి ఈ ధిక్కారమేంటి? రేపు మీరు బహిష్కరిస్తే ఈ విషయాలన్నీ చెప్పాలే’’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.