Begin typing your search above and press return to search.
మోడీ ఎలా గెలిచాడో చెప్పిన కేసీఆర్!
By: Tupaki Desk | 18 July 2019 4:40 AM GMTగెలుపంటే ఏంటి.? అదీ ఎన్నికల్లో ఎలా గెలుస్తారు.? ఏం చూస్తారు జనాలు.. మామూలుగా అయితే ఆ నాయకుడు మనకేం చేశాడని చూస్తాడు.. ఇచ్చిన హామీలు నెరవేర్చాడా? ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు కురిపించాడా అన్నది ఆలోచిస్తారు.. మధ్యప్రదేశ్ - ఒడిషాల్లో మూడు - నాలుగుసార్లు ముఖ్యమంత్రులను అలానే గెలిపించారు. తెలంగాణలో కేసీఆర్ ను అభివృద్ధి కోణంలోనే రెండోసారి గెలిపించారు.
మరి మోడీ ఎలా గెలిచాడు.? ఇది టఫ్ క్వచ్ఛన్. అంత తేలికగా దొరికే సమాధానం కాదు.. ‘మోడీదీ ఓ గెలుపా.?’ అని తాజాగా కేబినెట్ మీటింగ్ లో కేసీఆర్ కక్కేశారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి గుక్కపట్టుకొని ఉంటున్న కేసీఆర్ మొత్తానికి బయటపడ్డాడు. మోడీని ఎందుకు గెలిపించారో అసలు నిజం చెప్పేశాడు.
నిజమే మరీ.. మోడీ సంక్షేమ పథకాలను వెదజల్లి గెలవలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. గొప్పగా ప్రచారం చెప్పుకోవడానికి ఒక్క గట్టి పథకం కూడా మోడీ నుంచి రాలేదంటే అతిశయోక్తి కాదంటారు.. పైగా నోట్ల రద్దు పేరిట జనాలను బ్యాంకుల ముందు క్యూ కట్టించాడు. జీఎస్టీ పేరిట చిన్న - మధ్యతరహా పరిశ్రమలను దివాలా తీయించాడు. ఒక్కటేమిటీ సంస్కరణల పేరిట కార్పొరేట్లకు మేలు చేసి.. అన్నం పెట్టే రైతన్నకు ఏమీ చేయలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు.
మరి మోడీ ఎలా గెలిచాడంటే కేసీఆర్ విశ్లేషణ ఒక్కటే. అది దేశభక్తి సెంటిమెంట్ ను రెచ్చగొట్టి గెలిచాడట.. దేశంలో ఐదేళ్లలో మేలు చేసే ఏ పని చేయని మోడీ ఎలా గెలిచాడంటే దేశభక్తి - జాతీయతను రెచ్చగొట్టి గెలిచేయడమేనని కేసీఆర్ తేల్చేశారు. దేశంలో మోడీ చేసిన పనులపై చర్చ పెడితే ఏమీ లేవని కేసీఆర్ విమర్శించారు. గెలిస్తే ఏం చేస్తాడో కూడా మోడీ చెప్పలేదని..సెంటిమెంట్లను - భావోద్వేగాలను రెచ్చగొట్టి గెలిచిన మోడీది అసలు గెలుపే కాదు అని తేల్చేశాడు..
దేశప్రజలు కూడా అభివృద్ధిని పక్కనపెట్టి ఈ సెంటిమెంట్ భావజాలంలో పడిపోవడమే విచిత్రం అని కేసీఆర్ తేల్చేశారు. అభివృద్ధి చేసినా గెలవలేరని.. ఆ గెలిచే నైపుణ్యం వేరు అని కుండబద్దలు కొట్టారు. దేశంలో రెండోసారి గద్దెనెక్కిన మోడీ.. ఇప్పుడు కేసీఆర్ ను పూర్తిగా పక్కనపెట్టాడు. కలుద్దామన్నా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదట.. ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు ఇలా చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది... అందుకే ఇన్నాళ్లు మోడీపై వేచిచూసిన కేసీఆర్ ఇప్పుడు అసలు నిజాలు కక్కేశాడు. మోడీ గెలుపును గాలివాటంలా తేల్చేశాడు. మరి బలమైన మోడీ బ్యాచ్ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.