Begin typing your search above and press return to search.
వాళ్లు ఏం అర్థం కాని గొర్రెలు అంటున్న కేసీఆర్
By: Tupaki Desk | 12 July 2017 10:19 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు విపక్షాలపై మండిపడ్డారు. ఏకంగా విపక్ష నేతలను గొర్రెలతో పోల్చేశారు. మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని కరీంనగర్ లో ప్రారంభించిన కేసీఆర్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. గొర్రెల పంపిణీపై ప్రతిపక్ష గొర్రెలు విమర్శలు చేయడం అర్థరహితమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 84 లక్షల గొర్రెలను తీసుకువస్తే ఎక్కడైనా 10 గొర్రెలు చనిపోవా అని సీఎం ప్రతిపక్షాలను ప్రశ్నించారు. `మీ ముఖానికి 84 వందల గొర్రెలనైనా పంపిణీ చేశారా? ఎక్కడో పది గొర్రెలు చనిపోతే.. ఆ విషయాన్ని తీసుకొని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రతిపక్షాల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ అధికారం కోసం ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి తప్పా.. ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదు`అని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.
కరీంనగర్ పట్టణాన్ని లండన్ వలే మారుస్తానని కేసీఆర్ ప్రకటించారు. ``నేను మొండి వ్యక్తిని.. మాట చెప్పిననంటే తప్పను.. మరోసారి చెబుతున్న కరీంనగరం పట్టణాన్ని లండన్ నగరంలా తయారు చేస్తా. లండన్‌లో ఉన్నటువంటి థేమ్ నది అవకాశం కరీంనగర్ కు ఒక్కదానికే ఉందన్నారు. కరీంనగర్ కు పక్కనే మానేరు నది ఉంది కాబట్టి.. రాబోయే రోజుల్లో కరీంనగర్ లండన్ లా తయారవుతదన్నారు. దీనికి కరీంనగర్ ప్రజల సహకారం కావాలి. ఎందుకంటే ఇది ఏ ఒక్కరో చేస్తే కాదు, ప్రతి ఒక్కరు కలిసికట్టుగా చేస్తేనే అవుతుంది``అని సీఎం కేసీఆర్ కరీంనగర్ పట్టణ ప్రజలనుద్దేశించి చెప్పారు. మొన్ననే రూ. 500 కోట్లతో మానేరులో టూరిజం ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగిందన్నారు. కరీంనగర్ రోడ్లన్ని చాలా బాగా తయారు అవుతున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ. 25 కోట్లతో కరీంనగర్ కళాభారతిని నిర్మిస్తామన్న ఆయన.. త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు.
రెండేళ్ల తర్వాత కరీంనగర్ ను హెలికాప్టర్ నుంచి చూస్తే.. అడవిలో దిగుతున్నామా.. కరీంనగర్‌లో దిగుతున్నామా.. అనే విధంగా పచ్చబడాలని సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ హరిత కరీంనగర్ కావాలన్నారు. హరితహారంలో కరీంనగర్ తెలంగాణకే ఆదర్శం కావాలని కోరారు. ఇందుకు కరీంనగర్ ప్రజలు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి.. వాటిని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు.