Begin typing your search above and press return to search.
కేసీఆర్ మాట!... రైతుకు రైతే శత్రువట!
By: Tupaki Desk | 4 Aug 2017 1:47 PM GMTదేశానికి వ్యవసాయం వెన్నెముక. అలాంటి వ్యవసాయాన్ని నమ్ముకుని ఆరుగాలం పంట పొలాల్లో జీవనం సాగిస్తున్న రైతన్నను మన పాలకులు జవాన్లలో పోలుస్తున్న వైనం మనకు కొత్తేమీ కాదు. జవాన్లు దేశ సరిహద్దులో రాత్రింబవళ్లు కష్టపడి ప్రజలను కాపాడుతుంటే... ఆరుగాలం శ్రమిస్తున్న రైతన్న దేశ ప్రజలకు కడుపు నిండా అన్నం పెడుతున్నారు. మరి అలాంటి రైతుకు తాను పండిస్తున్న పంటకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా... రైతుకు గిట్టుబాటు ధర దక్కిన దాఖలానే కనిపించడం లేదు. రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడానికి మధ్య దళారీ వ్యవస్థే కారణమన్న విషయం ఏ ఒక్కరూ కాదనలేని సత్యం. రైతు నుంచి అతి తక్కువ ధరకే పంటలను కొనేస్తున్న దళారీ వ్యవస్థ... సదరు పంటలను ధాన్యంగా మలిచి అధిక ధరలకు మనకు అమ్మేస్తున్నారు. వెరసి పంట పండించిన రైతుకు కనీస గిట్టుబాటు ధర దక్కకపోవడమే కాకుండా... ఆ ధాన్యాన్ని కొంటున్న వినియోగదారుడి జేబుకు మాత్రం చిల్లు పడుతోంది.
ఈ వైనంపై తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొత్త అర్థం చెప్పుకొచ్చారు. హైదరాబాద్ శివారు శామీర్ పేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ సభలో పాల్గొన్న సందర్భంగా కేసీఆర్ ఈ కొత్త తరహా వ్యాఖ్యలు చేశారు. అసలు రైతుకు రైతే శత్రువుగా మారిపోతున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అయినా కేసీఆర్ ఈ సరికొత్త వాదనను ఎందుకు వినిపించారన్న విషయాన్ని పక్కనబెడితే... ఆయన వాదనలోని అసలు విషయాన్ని పరిశీలిస్తే ఆయన వాదనలోనూ కొంతలో కొంతైనా నిజముందిలే అన్న భావన వ్యక్తమవుతోంది. ఒక రైతు వేసిన పంటనే మరో రైతు - ఇంకో రైతు వేలం వెర్రిగా పండిస్తుండటం వల్ల గిట్టుబాటు ధర లేదని ఆయన వాపోయారు.
రైతుకు రైతే శత్రువు అవుతున్నాడని, ఆ విధంగా జరగకుండా చూసుకోవాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రైతుల పరిస్థితి బాగుండలేదని, ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతు సంఘాల ఏర్పాటు ప్రక్రియకు తెలంగాణ సర్కార్ పూనుకుందని అన్నారు. గ్రామ రైతు సమన్వయ సమితిల సమాహారంగా మండల రైతు సమాఖ్య, మండల రైతు సమాఖ్యల సభ్యులతో జిల్లా రైతు సమాఖ్య, జిల్లా రైతు సమాఖ్య సభ్యులతో రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు అవుతుందని, ప్రతి సమాఖ్యకు సమన్వయ సమితిని ప్రభుత్వం నియమిస్తుందని కేసీఆర్ చెప్పారు.