Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు టీ సెక్రటేరియట్ ఎలా ఉందంటే?
By: Tupaki Desk | 9 Oct 2016 10:03 AM GMTఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్క్ ప్లేస్ ఎక్కడ? అన్న ప్రశ్న వేస్తే.. తడుముకోకుండా చెప్పే సమాధానం సెకట్రటేరియట్ గా చెబుతారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఈ సమాధానం తప్పే అవుతుంది. కారణం ఏదైనా కానీ.. సెక్రటేరియట్ కు రావటానికి కేసీఆర్ కు సుతారం ఇష్టం ఉండదు. ఎందుకన్న ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. ఇలా సమాధానం చెప్పే వారి మాటల్ని ఒకటిగా చేస్తే.. కనిపించే కారణాల్లో ప్రముఖంగా.. సెక్రటేరియట్ వాస్తు ఏ మాత్రం బాగోలేదని.. నమ్మకాలకు పెద్దపీట వేసే కేసీఆర్.. అందుకే రావటం లేదన్న మాటను చెబుతారు.
దీనికి తగ్గట్లే.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సెక్రటేరియట్ కు వాస్తు పరంగా కొన్ని మార్పులు చేయించారు. కానీ.. ఎందుకో ఆయన సెక్రటేరియట్ కు రావటమే మానేశారు. ఎందుకన్న ప్రశ్నను ఆయన్ను సూటిగా అడిగినోళ్లు లేదు.. ఆయనా చెప్పింది లేదు. అయితే.. ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కు రావటం లేదన్న అంశానికి సంబంధించి పలుమార్లు పలువురు విమర్శలు సంధించినా.. కేసీఆర్ రియాక్ట్ అయ్యింది లేదు.
తాజాగా వరంగల్ లో మాట్లాడిన ఆయన.. తెలంగాణ సెక్రటేరియట్ మొదలు.. రవీంద్ర భారతి.. ఇలాంటి అంశాలు కొన్నింటిని ప్రస్తావించటమేకాదు.. తెలంగాణ సెక్రటేరియట్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ సెక్రటేరియట్ డంచర్ లా ఉందని.. అధికారులతో కలిసి భోజనం చేయటానికి పెద్ద హాలు కూడా లేదన్న మాట చెప్పి కేసీఆర్.. సెక్రటేరియట్ కు వెళ్లాలంటే పాము మాదిరి పెద్ద ఎత్తున వంపులు తిరగాల్సి ఉంటుందని.. ఎవరైనా విదేశీ ప్రముఖులు కలవటానికి వస్తే.. వారు ఎలా ఫీలవుతారన్న విషయాన్ని కాంగ్రెసోళ్లు ఆలోచించరా? అని మండిపడ్డారు.
సెక్రటేరియట్ మాత్రమే కాదు.. అసెంబ్లీ కూడా ఏ మాత్రంబాగోలేదన్న ఆయన.. వాటితో పాటు కళాభారతి పేరిట రవీంద్రభారతి స్థానే నిర్మించాలని ప్రభుత్వం చెబుతుంటే.. కాంగ్రెసోళ్లు అడ్డుపడుతున్నారంటూ మండిపోయారు. వేరే దేశాల నేతలు సెక్రటేరియట్ కు వస్తే వారి ముందు రాష్ట్రం పరువు ఏమవుతుందని ప్రశ్నించిన కేసీఆర్ తీరు చూస్తే.. వాస్తుతో పాటు.. తెలంగాణ సెక్రటేరియట్ తాను అనుకున్న స్థాయిలో లేకపోవటంతోనే.. ఆయన రావటం లేదా? అన్న అభిప్రాయం కలగటం ఖాయం. మొత్తంగా కొత్త కొత్త వాటి మీద కేసీఆర్ కు ఉన్న ఇష్టం తాజా మాటలతో స్పష్టమైనట్లే. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మీదున్న అక్కుసు పుణ్యమా అని అయినా కేసీఆర్ మనసులో ఏముందో స్పష్టంగా అర్థమైన పరిస్థితి. కేసీఆర్ మనసులోని మాటను తెప్పించిన టీ కాంగ్రెస్ నేతలకు థ్యాంక్స్ చెప్పాలా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/