Begin typing your search above and press return to search.
కొత్త జిల్లాలేమో కానీ భారీ కసరత్తే
By: Tupaki Desk | 22 Aug 2016 4:50 AM GMTకొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత కమిట్ మెంట్ తో ఉన్నారో తెలిసిందే. ఒక పట్టాన తెగని కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని టైమ్ లిమిట్ పెట్టుకొని మరీ పని చేస్తున్న కేసీఆర్.. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా నాటికి కొత్త జిల్లాలు వచ్చేయాలన్న తలంపులో ఉన్న ఆయన అందుకు తగ్గట్లు వేగంగా పావులు కదుపుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన సుదీర్ఘ కసరత్తును సకాలంలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. కొత్త జిల్లాలపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయటం.. తాను అనుకుంటున్న 17 కొత్త జిల్లాలపై ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూసుకోవటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో ఏ పార్టీ కూడా వ్యతిరేకించింది లేదు.
దీంతో.. కొత్త జిల్లాల కసరత్తుపై పెద్ద అడుగు పడినట్లైంది. అఖిల పక్షం తర్వాత చేపట్టాల్సిన పనుల్ని వేగంగా జరిగేలా కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అఖిలపక్షం నుంచి సానుకూలత వ్యక్తం కావటంతో కొత్త జిల్లాలపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఈ రోజు (సోమవారం) విడుదల కానుంది. కొత్త జిల్లాలు.. రెవెన్యూ డివిజన్లు.. మండలాలకు సంబంధించిన ప్రతిపాదనల్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ.. స్థానిక సంస్థల్లోని నోటీస్ బోర్డుల మీద అందరికి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.
మండలాలు.. రెవెన్యూ డివిజన్ల విషయంలో అఖిలపక్ష సమావేశంలో వచ్చిన సూచనలపై కేసీఆర్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఆదివారం దీనికి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అఖిలపక్షంలో వచ్చిన వినతుల ఆధారంగా ఏమేం మార్పులు చేయొచ్చన్న అంశాలపై దృష్టి పెట్టటం గమనార్హం. ముసాయిదా రూపకల్పనలో తీసుకోవాల్సిన అన్నిజాగ్రత్తలపై అధికారుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటికి రెండుసార్లు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అందరి సమన్వయంతో కసరత్తు పూర్తి చేయటం.. ముసాయిదాలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ అధికారుల్ని కోరినట్లుగా చెబుతున్నారు. ముసాయిదా విడుదల అనంతరం.. ప్రసార మాధ్యమాల్లో కొత్త జిల్లాలకు సంబంధించిన సమాచారంపై పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కొత్తజిల్లాల ఏర్పాటు సంగతేమో కానీ.. భారీ కసరత్తును పరిమిత కాలంలో పూర్తి చేయటం మామూలు విషయం కాదన్న మాట రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ పట్టుదలను ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా చెప్పుకోవటం కనిపిస్తోంది. అనుకున్నదేదైనా అనుకున్నట్లే జరగాలని తపించే కేసీఆర్ కమిట్ మెంట్ కొత్త జిల్లాల రూపంలో మరోసారి అందరికి కనిపిస్తుందనటంలో సందేహం లేదు.