Begin typing your search above and press return to search.
కేసీఆరే ఇగోనే హర్ట్ చేశారే
By: Tupaki Desk | 29 April 2016 5:04 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాకులివ్వటానికి రాజకీయ పార్టీలు సైతం భయపడుతున్న పరిస్థితి. జెయింట్ గా మారిన తెలంగాణ ముఖ్యమంత్రితో తొందరపాటుతో లొల్లి పెట్టుకోవటానికి ఎవరూ సాహసించని వేళ.. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కాలుదువ్వటం సంచలనంగా మారింది. మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నా.. ప్రైవేటు కాలేజీల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. చిత్రమైన విషయం ఏమిటంటే.. తన రాజకీయ స్వార్థం కోసం వేసే ఎత్తుల్లో తిరుగులేని అధిక్యత కనబరుస్తున్న కేసీఆర్.. ఒక మంచి అంశంపై ఆయన చేస్తున్న పోరులో ఆయనకు ఎదురుదెబ్బ తగలటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బోగస్ కాలేజీల విషయంలో కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బోగస్ కాలేజీల కథ తేల్చాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పోలీసు యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. అయితే.. ప్రైవేటు విద్యా సంస్థల్లో పోలీసుల తనిఖీలను నిరసిస్తూ.. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో.. తనిఖీల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పోరాడటం షురూ చేశాయి.
కాలేజీల తీరుపై ఆగ్రహంతో ఉన్న కేసీఆర్.. వారి పోరాటాన్ని లైట్ గా తీసుకున్నారు. వారి డిమాండ్లను పరిశీలించేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రికి షాక్ ఇచ్చేందుకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలన్నీ ఒకటి కావటం గమనార్హం. వారంతా కలిసి.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాల్సిన టెట్.. ఎంసెట్ పరీక్షల్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
ఒక రాష్ట్ర సర్కారు తాను నిర్వహించాల్సిన పరీక్షల్ని.. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల పోరాటం కారణంగా వాయిదా వేయాల్సిన రావటానికి మించిన ఎదురు దెబ్బ మరొకటి ఏముంటుంది? కొమ్ములు తిరిగిన రాజకీయ పక్షాలు మాత్రమే కాదు.. బలమైన వ్యవస్థలుగా పేరున్న మీడియా సైతం తెలంగాణ ముఖ్యమంత్రి దెబ్బకు ఆచితూచి వ్యవహరిస్తున్న వేళ.. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అందుకు ఇందుకు భిన్నంగా కేసీఆర్ ఇగోను టచ్ చేయటానికి సైతం వెనుకాడకపోవటం విశేషం.
విద్యాసంస్థల వైఖరితో కంగుతున్ని తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లోకి దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా సీన్లోకి వచ్చేశారు. మొండితనానికి నిలువెత్తు రూపమైన కేసీఆర్ ను కంగుతినిపించిన ప్రైవేటు విద్యాసంస్థల విషయంపై ముఖ్యమంత్రి పూర్తి ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒక ప్రభుత్వం నిర్వహించాలని భావించిన ప్రతిష్ఠాత్మకమైన పరీక్షల్ని తాను అనుకున్నట్లుగా నిర్వహించలేక.. వాయిదా వేయాల్సి రావటం కేసీఆర్ ఇగోను హర్ట్ చేస్తుందనటంలో ఎలాంటి సదేహం లేదు. తనలోని ఏ పార్ట్ ను అయితే ఎవరూ టచ్ చేయకూడదని ఫీల్ అవుతారో.. ఇప్పుడదే పార్ట్ కి డ్యామేజ్ జరిగిన నేపథ్యంలో కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారిందని చెప్పక తప్పదు.