Begin typing your search above and press return to search.
జగన్ గెలుపు తథ్యమా.....
By: Tupaki Desk | 10 Oct 2018 7:36 AM GMTఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందా....ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారా... అవుననే అంటున్నాయి తెలంగాణ పోలిస్ - నిఘా విభాగాలు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులపై తెలంగాణ ఇన్ టెలిజేన్స్ విభాగం చేసిన సర్వే వివరాలు జగన్ ముఖ్యమంత్రి అవుతాడని వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ పని - ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పని ముగిసినట్లేనని రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక తెలంగాణ పోలిస్ మరి ఇంటెలిజేన్సీ విభాగం చేసిన సర్వే ఫలితాలే కారణమని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - వామపక్షాలు కూటమి కడతాయని భావిస్తున్న తొలి రోజులలోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు - ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితిపై సర్వే చేయించినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సర్వే ఫలితాలను బట్టి తెలంగాణలో ఎత్తుగడలు - వ్యూహాలను రూపొందించాలని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.
ఇటీవల నిజామాబాద్ - నల్గొండ - వనపర్తిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగా సభలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై కె. చంద్రశేఖర రావు నిప్పులు కురిపించారు. ఈ ఆగ్రహ ప్రసంగానికి కారణం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పని అయిపోయిందని నివేదిక రావడమే అంటున్నారు. పొరుగు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని తెలంగాణలో బేరీజు వేసుకోవాలని - దానిని అనుసరించే ఇక్కడ వ్యూహాలు రూపొందించుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని నిర్దరణకు వచ్చిన తర్వాత చంద్రబాబు నుంచి తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాదని కేసీఆర్ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వస్తే ఇప్పటి నుంచే ఆయనతో సఖ్యంగా మేలుగుతామనడానికి చంద్రబాబుపై ఎక్కు పెట్టిన విమర్శలే నిదర్శనమని అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పోలిస్తే వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు కొంత కేడర్ ఉంది. చంద్రబాబుపై నిప్పులు చెరగడం ద్వారా వైఎస్ ఆర్ కాంగ్రెస్ సానుభూతిని కూడా తమవైపు తిప్పుకోవచ్చని కేసీఆర్ ఎత్తుగడగా తెలుస్తోంది. తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడంతో నిఘా వర్గాల నివేదిక వాస్తవమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పోలిస్ - నిఘా విభాగాలు హోం మంత్రికి విధేయులై పనిచేస్తారని, దీంతో హోం మంత్రి చేసిన ప్రకటన స్వాదికారమైనదని వారు అంటున్నారు.