Begin typing your search above and press return to search.

వంద కాదంట‌.. 110 సీట్లు ఖాయ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   5 Oct 2018 1:30 AM GMT
వంద కాదంట‌.. 110 సీట్లు ఖాయ‌మ‌ట‌!
X
నేను కానీ మూడో క‌న్ను తెరిస్తేనా చంద్ర‌బాబు.. నీ గ‌తేమిటో? అంటూ ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. మ‌రో రాష్ట్ర ముఖ్య‌మంత్రికి వార్నింగ్ ఇవ్వ‌గ‌ల‌రా? నో వే అనేస్తారు. కానీ.. తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూటు స‌ప‌రేటు. త‌న‌ను ఎవ‌రైనా ఏదైనా అన్న వెంట‌నే.. ఒక ముఖ్య‌మంత్రిని ప‌ట్టుకొని అంత మాట అనేస్తారా? క‌నీసం.. మ‌ర్యాద‌.. గౌర‌వం ఇవ్వ‌రా? అనేస్తారు. అదే కేసీఆర్ తాను మాత్రం అలాంటివేమీ ప‌ట్టించుకోకుండా నోటికి వ‌చ్చిన‌ట్లుగా తిట్టేస్తారు. ఆయ‌న్ను ఎవ‌రూ ఏమీ అన‌కూడ‌దు కానీ.. ఆయ‌న మాత్రం త‌న‌కు న‌చ్చ‌నోళ్ల‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్య‌ను చేయ‌టానికైనా వెనుకాడ‌ర‌ని చెప్పాలి.

ఈ రోజు న‌ల్గొండ జిల్లాలో జ‌రిగిన ప్ర‌జా ఆశీర్వాద యాత్ర‌లో భాగంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఒక రేంజ్లో ఉతికి ఆరేసిన కేసీఆర్.. ప‌నిలో ప‌నిగా కాంగ్రెస్ పైనా తిట్ల దండ‌కాన్ని వినిపించారు. మ‌హాకూట‌మి అంటూ కాంగ్రెస్‌.. టీడీపీల పొత్తుపై ఆయ‌న ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఇప్ప‌టివ‌ర‌కూ వంద స్థానాలు తమ‌వేనంటూ బ‌ల్ల‌గుద్ది వాదిస్తున్న కేసీఆర్.. ఈ రోజు అందుకు భిన్నంగా మ‌రో ప‌ది సీట్ల‌ను గులాబీ ఖాతాలోకి వేసేయ‌టం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలు ఉండ‌గా.. మ‌జ్లిస్ కు 7 స్థానాలు తీసివేస్తే.. మిగిలేవి 112 స్థానాలు. వాటిల్లో 110 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుంద‌న్న మాట తాజాగా కేసీఆర్ చెప్పారు.

త‌న‌కు వ‌చ్చిన తాజా స‌ర్వేతో టీఆర్ ఎస్ 110 స్థానాల్లో గెలుస్తుంద‌ని.. ఉత్త‌మ్ గోచి ఊడిపోతుంద‌ని చెప్పారు. నిజంగా టీఆర్ ఎస్ కానీ ఈ స్థాయిలో గెలిచే అవ‌కాశ‌మే ఉంటే.. కేసీఆర్ ఎందుకంత తీవ్ర‌స్థాయిలో చంద్ర‌బాబు.. కాంగ్రెస్ ల‌ను ఉద్దేశించి విరుచుకుప‌డుతున్నారు అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఏమైనా 119 సీట్ల‌లో 110 సీట్లు త‌మ‌వేనంటూ కేసీఆర్ చెబుతున్న స‌ర్వే మాట‌ల్లో నిజం ఎంత‌న్న‌ది కాలం మాత్ర‌మే స‌రైన స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.