Begin typing your search above and press return to search.

వ‌చ్చే సీట్ల లెక్క చెప్పి షాకిచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   31 Jan 2018 5:14 AM GMT
వ‌చ్చే సీట్ల లెక్క చెప్పి షాకిచ్చిన కేసీఆర్
X
ఎన్నిక‌ల వస్తున్నాయంటే చాలు.. అధికార‌ప‌క్షం గుండెల్లో రైళ్లు ప‌రిగెత్త‌టం మామూలే. ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా తాము రెఢీ అన్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా పార్టీకి చెందిన ముఖ్య‌నేత‌లు.. స‌న్నిహితుల‌తో క‌లిసి భేటీ అయిన కేసీఆర్‌.. ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఎన్నిక‌లు జ‌రిగితే టీఆర్ ఎస్ బ‌లం ఎంత పెరుగుతుంద‌న్న విష‌యాన్ని సీఎం కేసీఆర్ త‌న స‌న్నిహితుల‌తో పంచుకున్న‌ట్లుగా చెబుతున్నారు. మొత్తం 119 స్థానాల‌కు కాను.. 102 స్థానాల్లో టీఆర్ ఎస్ పార్టీ విజ‌యం సాధిస్తాయ‌ని చెప్పిన‌ట్లుగా తెలిసిందే. పార్టీకి వ‌చ్చే సీట్ల మాట‌తో పాటు.. వారి వ్యాఖ్య‌ను కూడా కేసీఆర్ పంచుకున్న‌ట్లుగా చెబుతున్నారు. స‌ర్వే జ‌రిపిన మూడు సంస్థ‌లు చాలా న‌మ్మ‌కంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

క్షేత్ర‌స్థాయిలో స‌ర్వే నిర్వ‌హించిన మూడు సంస్థ‌లు.. టీఆర్ ఎస్‌ కు వ‌చ్చే ఫ‌లితాల‌పై గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్న‌ట్లుగా కేసీఆర్ వెల్ల‌డించారు. ఒక‌వేళ తాము చేసిన సర్వే ఫ‌లితాలు నిజం కాని ప‌క్షంలో తామీ ప‌ని నుంచి శాశ్వితంగా త‌ప్పుకోనున్న‌ట్లుగా చెప్పార‌ని.. 2014 ఎన్నిక‌ల వేళ ఏ సంస్థ‌కు అయితే స‌ర్వే బాధ్య‌త అప్ప‌గించామో.. ఇప్పుడదే సంస్థ‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లుగా సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

టీఆర్ ఎస్ విజ‌యం మీద స‌ర్వే సంస్థ‌లు చెప్పిన వివ‌రాల‌తో సంతోషంలో మునిగితేలాల్సిన అవ‌స‌రం లేద‌ని.. విజ‌య గ‌ర్వం త‌ల‌కెక్కించుకోకుండా అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ప‌ని చేయాల‌ని చెప్పిన‌ట్లుగా తెలిసింది. విజ‌య‌గ‌ర్వం త‌ల‌కెక్కించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని త్వ‌ర‌లో ప్ర‌జ‌ల్లో తీసుకెళ్లేందుకు తానే స్వ‌యంగా రంగంలోకి దిగ‌నున్న‌ట్లు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. తాను రంగంలోకి దిగితే.. ఎమైనా.. ఎక్క‌డైనా లోటుపాట్లు ఉంటే అవ‌న్నీకొట్టుకుపోవ‌టం ఖాయ‌మ‌న్న ధీమాను వ్య‌క్తం చేసిన‌ట్లు చెబుతున్నారు. స‌ర్వే సంస్థ‌లు సైతం ఆశ్చ‌ర్య‌పోయేలా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ స‌త్తా చాట‌నుంద‌ని చెప్ప‌టం చూస్తే.. కేసీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. స‌ర్వే సంస్థ‌లు చెప్పిన‌ట్లుగా గులాబీ పార్టీకి 102 స్థానాలు వ‌స్తాయా?  రావా?  అన్న‌ది తేలాలంటే కొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దు.