Begin typing your search above and press return to search.

సెక్యుల‌ర్ పార్టీ అయితే మ‌జ్లిస్ తో దోస్తానా ఏంది?

By:  Tupaki Desk   |   7 Sep 2018 5:28 AM GMT
సెక్యుల‌ర్ పార్టీ అయితే మ‌జ్లిస్ తో దోస్తానా ఏంది?
X
మాట‌ల‌తో మాయ చేయ‌ట‌మే కాదు.. ఎదురు ప్ర‌శ్న‌లు వేసేందుకు సైతం అవ‌కాశం ఇవ్వ‌కుండా దూకుడును ప్ర‌ద‌ర్శించే గుణం తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఒకింత ఎక్కువే. తాను చెప్పే మాట‌ల్లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించే లోపం ఉన్నా.. అలాంటిదేమీ లేద‌న్న ధీమాను ప్ర‌ద‌ర్శించ‌టంతో పాటు.. ఏం మాట్లాడుతున్నావ్ ? అంటూ గ‌ద్దించే స్వ‌రంతో మ‌న‌సులోని ఆలోచ‌న‌ల్ని బ‌య‌ట‌కురాకుండా అడ్డుకునే మైండ్ గేమ్ ను కేసీఆర్ త‌ర‌చూ అమ‌లు చేస్తుంటారు. ఈ తీరుతోనే మీడియాను.. మీడియా ప్ర‌తినిధుల‌ను కంట్రోల్ చేయ‌టం ఆయ‌న‌కో అల‌వాటుగా మారింది.

తాజా ప్రెస్ మీట్ ను చూసిన‌ప్పుడు త‌మ‌ది సెక్యుల‌ర్ పార్టీ అంటూ ప‌దే ప‌దే చెప్ప‌టం క‌నిపిస్తుంది. బీజేపీతో భ‌విష్య‌త్తులో రిలేష‌న్ అన్న మాట‌కు అవ‌కాశమే లేద‌ని తేల్చేసిన కేసీఆర్‌.. అయినా ఆ ఆలోచ‌న ఎందుకంటూ త‌మ‌ది సెక్యుల‌ర్ పార్టీ అంటూ రాగాన్ని వినిపించారు.

ఒక‌వైపు సెక్యుల‌ర్ రాగాన్ని వినిపిస్తూనే.. మ‌రోవైపు మ‌జ్లిస్ తో త‌మ‌కున్న స్నేహాన్ని చెప్పుకోవ‌టం కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. బీజేపీ మ‌త‌త‌త్వ పార్టీ అయితే.. మ‌జ్లిస్ ఏమ‌వుతుంది? మ‌తాన్ని నేరుగా బీజేపీ అధినేత‌లు ప్ర‌స్తావించేది చాలా అరుదు.

కానీ.. మ‌జ్లిస్ అధినేత నోటి నుంచి వ‌చ్చే ప్ర‌తి మాట‌లో అది కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌త‌త‌త్వ పార్టీతో తాము జ‌త క‌ట్టే ప్ర‌శ్నే లేదంటూ కొట్టిపారేసే కేసీఆర్‌.. మ‌రోవైపు మ‌త‌త‌త్వ పార్టీకి నిలువెత్తు రూప‌మైన మ‌జ్లిస్ తో త‌మ‌కు స్నేహ‌పూర్వ‌క సంబంధాలు ఉన్న‌ట్లు చెప్ప‌టం తెలిసిందే.

మ‌జ్లిస్ తో దోస్తానా చేసే టీఆర్ఎస్ సెక్యుల‌ర్ పార్టీ ఎంత‌వ‌ర‌కు? అన్న‌ది ప్ర‌శ్న‌. మ‌జ్లిస్ తో ఫ్రెండ్ షిప్ కు అడ్డు రాని సెక్యుల‌ర్ వైఖ‌రి..బీజేపీతో ఎందుకు వ‌స్తుంద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌దు. ఏమైనా.. త‌న‌కు న‌చ్చినోళ్ల‌తో న‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే కేసీఆర్‌.. త‌మ‌ను తాము స‌ర్టిఫికేట్లు ఇచ్చేసుకోవ‌టం.. వాటికి అంద‌రి ఆమోద ముద్ర ప‌డేలా చేసుకోవ‌టంలో దిట్ట అని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌జ్లిస్ తో దోస్తానా చేసినా.. టీఆర్ ఎస్ సెక్యుల‌ర్ పార్టీనే. ఎందుకంటే కేసీఆర్ చెప్పారుగా.