Begin typing your search above and press return to search.
బాబు లాంటి తప్పు చేయనంటున్న కేసీఆర్
By: Tupaki Desk | 13 April 2017 5:12 AM GMTతెలుగు రాష్ర్టాలుగా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ఏర్పడిన అనంతరం ఒక రాష్ట్రంలో జరిగిన పరిణామం ఆ పక్కనే ఉన్న మరో రాష్ట్రంలో కూడా జరుగుతుందా అనే ఉత్సుకతతో కూడిన సందేహం (!) బాగా పెరిగిపోయింది. రాజకీయ పరమైన నిర్ణయాల విషయంలో అయితే ఇది మరింతగా ఉంటోంది. ఇదే రీతిలో ఏపీలో జరిగిన మంత్రివర్గ విస్తరణ గురించి ఇటీవల చర్చలు మొదలయ్యాయి. అయితే దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. కేబినెట్ సమావేశం అనంతరం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ రాష్ట్ర మంత్రి వర్గ పునర్వవస్థీకరణ ఉండబోదని తేల్చి చెప్పారు.
మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే తల పట్టుకున్నారని, నాకెందుకు ఆ తలనొప్పి అని కేసీఆర్ తనదైన శైలిలో చమత్కరించారు. అలాంటి చర్చ ప్రస్తుతం లేదని చెప్పారు. కాగా, 2019లో తాము అధికారంలోకి వచ్చి ఒకే విడతలో రైతు రుణమాఫీ చేస్తామన్న పీసీసీ అధ్యక్షులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తావించగా అదే రీతిలో సెటైర్ వేశారు. `వాళ్ళు అధికారంలో వస్తే కదా దీనిపై చర్చించుకోవాలి` అని సీఎం అన్నారు. రాష్ట్రంలో అసలు ఎన్నికల వాతావరణమే లేదని, ఎన్నికలకు ఇంకా 26 నెలలు ఉందని కేసీఆర్ చెప్పారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్వవస్థీకరణకు సంబంధించిన నిర్ణయం వందకు వంద శాతం వెలువడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది తనకు వచ్చిన తాజా సమాచారమని, పార్లమెంటు సమావేశాలు ముగిసినప్పటికీ ఆర్డినెన్స్ ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభిస్తారని కేసీఆర్ తెలిపారు.
కీలకమైన ధర్నా చౌక్ ఎత్తివేత గురించి కేసీఆర్ స్పందిస్తూ ఇప్పటికైతే ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ రద్దు చేయలేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు అవకాశం ఉండాలని తాను కోరుకుంటానని కేసీఆర్ అన్నారు. అయితే కొంత మంది కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ, తాము నిర్ణయించిన చోటే, రక్తాలు పారినా ధర్నా చేస్తామంటున్నారని అన్నారు. దీనిపై చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. తమకు అసౌకర్యం కలుగుతున్నందున ధర్నా చౌక్‌ను మార్చాలని ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ఆధారంగా కోర్టు ప్రభుత్వాన్ని ప్రత్యామ్నాయ ప్రదేశం కోరిందని ఈ విషయంలో పోలీసు విభాగం తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయినా ధర్నా ఎక్కడ చేసినా ఒక్కటేనని, టివిలలో ప్రత్యక్ష ప్రసారాలు వచ్చినందున ప్రభుత్వానికి, ప్రజలకు విషయం చేరుతుందని కేసీఆర్ చెప్పారు. కాగా, రాష్ట్రంలో నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు, భీమా, తదితర ఎత్తిపోతల పథకాలకు 10వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, అందుకు అయ్యే రూ.10వేల కోట్ల బిల్లును ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ తెలిపారు. ఛత్తీస్ ఘఢ్ విద్యుత్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని కొంత మంది బుద్ధిహీనంగా, తెలివి తక్కువగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు ప్రభుత్వాలకు మధ్య జరిగే విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలకు ఆస్కారముంటుందా? అని ప్రశ్నించారు. పైగా ఛత్తీస్‌ఘఢ్ నుండి రూ.3.80 పైసలకే ఒక యునిట్ లభిస్తుందని కేసీఆర్ చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/