Begin typing your search above and press return to search.
మిత్రుడికి పదవిచ్చి.. ప్రగతిభవన్ కు పిలిపించిన సీఎం
By: Tupaki Desk | 10 May 2018 4:56 AM GMTసీఎం కేసీఆర్ అంతే. ఒకసారి డిసైడ్ అయితే ఆయన అంతే. తాను మనసు పెట్టిన విషయం ఏదైనా సరే.. మొత్తంగా పూర్తి కావాల్సిందే. అరకొర చేసి వదిలేయరు. వంక పెట్టటానికి వీల్లేని రీతిలో వ్యవహరించటం ఆయనకు అలవాటు. అదే రీతిలో మరోసారి రియాక్ట్ అయ్యారు కేసీఆర్. తన చిన్ననాటి స్నేహితుడు బొమ్మరి వెంకటేశంకు కాళేశ్వరం దేవాలయ ఛైర్మన్ గా పదవిని ఇచ్చిన వైనం తెలిసిందే.
ప్రగతిభవన్ కు ఎవరి అనుమతి లేకుండా సీఎంను కలిసేందుకు డైరెక్ట్ యాక్సిస్ ఉన్న అతి కొద్దిమందిలో బొమ్మరి వెంకటేశం ఒకరు. కేసీఆర్ కు చిన్ననాటి స్నేహితుడైన ఆయన్ను.. ఏదైనా పని కావాలా? పదవి కావాలా? అంటూ సీఎం అడుగుతూ ఉండేవారు.
ఏ రోజు తనకు ఫలానా కావాలని అడగని మిత్రుడు.. ఈ మధ్యన కేసీఆర్ అడిగిన మాటకు స్పందిస్తూ.. ఏదైనా గుడికి బోర్డులో డైరెక్టర్ గా అవకాశం ఇస్తే.. దేవుడికి సేవ చేసుకుంటానని చెప్పటం తెలిసిందే. స్నేహితుడు అడిగిన డైరెక్టర్ పదవిని కాకుండా అంతకు మించి అన్నట్లు.. కాళేశ్వరం దేవాలయ ఛైర్మన్ పదవిని ఇచ్చి స్వీట్ షాక్ ఇచ్చారు.
తన మేనల్లుడు కమ్ మంత్రి అయిన హరీశ్ చేత ఛైర్మన్ పదవికి సంబంధించిన అధికారిక పత్రాలు పంపిన కేసీఆర్.. తాజాగా తన మిత్రుడ్ని మరోసారి ప్రగతిభవన్ కు పిలిపించుకున్నారు.
సాధారణంగా పదవి ఇచ్చిన తర్వాత వారే ముఖ్యమంత్రిని కలిసి తమ సంతోషాన్ని పంచుకుంటారు. కానీ.. బొమ్మరి విషయంలో మాత్రం కాస్త వేరుగా జరిగింది. ఆలయ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన బొమ్మరిని ప్రగతిభవన్ రావాల్సిందిగా కోరారు. తన స్నేహితుడికి స్వీట్ పెట్టి.. శాలువతో సత్కరించారు. తాను అత్యున్నత స్థాయిలో ఉండి కూడా బాల్య స్నేహితుడి కోసం కేసీఆర్ తపించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. ఏమైనా.. కేసీఆర్ తో ఫ్రెండ్ షిప్పే వేరప్ప అనేలా తాజా ఎపిసోడ్ లో వ్యవహరించారని చెప్పక తప్పదు.