Begin typing your search above and press return to search.

మంత్రివ‌ర్గం ముహుర్తం ఖ‌రారు..జిల్లాల వారీగా వీరికే చాన్స్‌

By:  Tupaki Desk   |   27 Jan 2019 6:07 AM GMT
మంత్రివ‌ర్గం ముహుర్తం ఖ‌రారు..జిల్లాల వారీగా వీరికే చాన్స్‌
X
సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో - ప్ర‌ధానంగా తెలంగాణ‌లోని అధికార పార్టీలో నెల‌కొంటున్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డ‌నుందని వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహుర్తం ఖ‌రారు చేశార‌ని చెప్తున్నారు. సంక్రాంతికి ముందే విస్తరణ అని కొన్నాళ్ళు.. యాగం తర్వాత అని మరికొన్నాళ్లు ప్రచారం చక్కర్లు కొట్టగా ఇప్పుడు మాఘమాసంలో విస్తరణకు మంచి ముహూర్తం పెట్టేసినట్లుగా తెలుస్తుంది. వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో తొలివారంలో ఉండ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పుష్య మాసం ఫిబ్రవరి 4తో పూర్తయి 5తో తేదీ నుంచి మాఘ మాసం ప్రారంభమవుతుంది. 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అత్యంత ఉత్తమమైన మూహూర్తం చూసి మంత్రి వర్గాన్ని విస్తరించాలన్న తలంపుతో కేసీఆర్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఆరు నెంబర్ కేసీఆర్ అదృష్ట సంఖ్యగా భావించనుండగా పదో తేదీ వసంత పంచమి ఉంది. ఈరెండు ముహూర్తాలలో ఒకటి క్యాబినెట్ విస్తరణ ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. కాగా 6మొత్తం 18 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉన్నా ముందుగా ఎనిమిది మందితో విస్తరణ చేయనున్నారని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాత్రమే పూర్తి విస్తరణ ఉండనుందని పార్టీ వర్గాలలో వినిపిస్తుంది.

విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఉమ్మడి జిల్లాల వారీగా ఈ పేర్ల‌ను గులాబీ ద‌ళ‌ప‌తి తీవ్రంగా ప‌రిశీలిస్తున్నారు.

కరీంనగర్‌: కేటీఆర్‌ - ఈటల రాజేందర్‌ - కొప్పుల ఈశ్వర్‌
మెదక్‌: హరీష్‌ రావు - పద్మాదేవేందర్‌ రెడ్డి -
వరంగల్‌: కడియం శ్రీహరి - దయాకర్‌ రావు - దాస్యం వినయ్‌ భాస్కర్‌
ఆదిలాబాద్‌: ఇంద్రకరణ్‌ రెడ్డి - బాల్కసుమన్‌ - జోగురామన్న - రేఖానాయక్‌ - కోనేరుకోనప్ప,
నిజామాబాద్‌: వేముల ప్రశాంత్‌ రెడ్డి
హైదరాబాద్‌: నాయిని నర్సింహారెడ్డి - తలసాని శ్రీనివాసయాదవ్‌ - పద్మారావు - దానం నాగేందర్‌
మహబూబ్‌ నగర్‌: లక్ష్మారెడ్డి - నిరంజన్‌ రెడ్డి - శ్రీనివాసగౌడ్‌ - నరేందర్‌ రెడ్డి
నల్లగొండ: జగదీష్‌ రెడ్డి - గుత్తా సుఖేందర్‌ రెడ్డి - గొంగడిసునిత
ఖమ్మం: పల్లా రాజేశ్వరరెడ్డి - పువ్వాడ అజయ్‌
రంగారెడ్డి: గాంధీ - కేపీ వివేక్‌