Begin typing your search above and press return to search.
అసెంబ్లీ ముగించడంలో కూడా కేసీఆర్ రికార్డే
By: Tupaki Desk | 30 March 2018 4:19 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ నిర్వహణలో మరో రికార్డు సృష్టించారు. గత ఏడాది సుదీర్ఘకాలం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఓ ప్రత్యేకతను తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్ ఈ ఏడాది అంతకు భిన్నమైన మరో రికార్డును సాధించారు. అదే ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నిర్వహించడం. కీలకమైన బడ్జెట్ ను ప్రతిపక్షం లేకుండానే ఆమోదించుకున్నారు. 13 రోజులుగా కొనసాగిన శాసనసభ - మండలిలో మూడు ప్రధానమైన బిల్లులను ఆమోదించాయి. ప్రయివేట్ యూనివర్సిటీ బిల్లు - పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు - మున్సిపాలిటీల బిల్లును ఆమోదించాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే శాసనసభ సమావేశాలు ముగియడం గమనార్హం.
గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడం - ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్ కుమార్ సభ్యత్వాలను ఆగమేఘాల మీద రద్దు చేయడం చర్చనీయాశంమైంది. దీంతో సభకు వచ్చేందుకు సభ్యులకు అవకాశం లేకపోవడంతో అధికార పార్టీ తమదైన శైలిలో సభను నిర్వహించింది. సభలో టీఆర్ ఎస్ కు అనుబంధ సంస్థగా ఎంఐఎం వ్యవహరించింది. అధికార పార్టీ తాన అంటే తందనా అన్నది. ప్రయివేట్ యూనిర్సివటీల బిల్లు విషయంలో అన్ని అంశాలు మాట్లాడి చివరకు సంపూర్ణ మద్దతు తెలిపింది. మిగిలిన పక్షాలైన బీజేపీ - టీడీపీ సీపీఎం ప్రజా సమస్యలను సర్కారు వద్ద తమ శక్తి మేరకు ప్రయత్నించారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలు 60 గంటలపాటు జరిగాయి. అందులో ముఖ్యమంత్రి - మంత్రులు - ఎమ్మెల్యేలతో సహా 38 గంటలపాటు సభలో ప్రసంగించారు. 13 రోజుల్లో మిగిలిన పార్టీల నేతలు 22 గంటలపాటు ప్రసంగించారు. ప్రజా సమస్యల ప్రస్తావన కంటే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, రైతు పెట్టుబడి పథకం - 24 గంటల కరెంట్ సరఫరా - గొర్రెల పంపణీ - మొత్తంగా బీసీల సంక్షేమం చుట్టూ సభలో చర్చను తిప్పడంలో అధికార పార్టీ పైచేయి సాధించింది. అయితే ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సభలు జరగడం మాత్రం చర్చనీయాశమైంది. మొత్తం అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సస్పెషన్లు - సభ్యత్వాల రద్దు గురించి అధికార పార్టీ ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా గత కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగట్టింది.