Begin typing your search above and press return to search.
కోర్టు షాకిస్తే...కేసీఆర్ సీటిస్తారట
By: Tupaki Desk | 29 Oct 2016 11:02 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను తలచుకుంటే ఏదో రూపంలో అయిన ఆ పనిని పూర్తిచేసేవరకు వదలిపెట్టరు. దసరా సందర్భంగా కొత్త జిల్లాలకు తోడు.. తొమ్మిది కార్పోరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. క్యాడర్ లో నెలకొన్న ఉత్సాహాన్ని చూసి దీపావళి సందర్భంగా మరో విడత పదవుల బొనాంజా ఇవ్వబోతున్నారు. అయితే కోర్టు తీర్పు కారణంగా పదవులు కోల్పోయిన వారికి ఈ సందర్భంగా తీపికబురు ఇవ్వనున్నట్లు సమాచారం.
గతంలో పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించబడి.. కోర్టు తీర్పుతో పదవులు కోల్పోయిన వారిలో కొందరికి ఈ దఫా ఛాన్స్ దక్కే అవకాశం కనబడుతోంది. మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ రకంగా అదృష్టాన్ని కోల్పోయిన వారిలో ఉన్నారు. వారిలో ముగ్గురికి కార్పొరేషన్ పదవులు పక్కాగా దక్కుతాయనేది గులాబీ వర్గాల సమాచారం. కాగా.. దసరా సందర్భంగా ప్రకటించిన కార్పోరేషన్లలో జిల్లా పార్టీ అధ్యక్షులకు ప్రాధాన్యతను ఇచ్చిన సీఎం కేసీఆర్ ఈ దఫా ప్రకటించే కార్పోరేషన్ చైర్మన్ల పదవుల్లో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించిన వారికి.. జిల్లా పార్టీ అధ్యక్షపదవి ఇచ్చి - వెంకట్రావుకు కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు వైఎస్సార్ సీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన తాటి వెంకటేశ్వర్లుకు ట్రైకార్ చైర్మన్ పదవిని ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా జైబోలో తెలంగాణ దర్శకుడు ఎన్.శంకర్ కు ఇవ్వవచ్చని టీఆర్ ఎస్ వర్గాల సమాచారం. ఒక మహిళా ఎమ్మెల్యేకు లేదా సీనియర్ మహిళానేతకు కార్పోరేషన్ పదవి దక్కవచ్చని తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూమారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం పెద్దసంఖ్యలో హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్యేలు.. తమకు సన్నిహిత మంత్రుల ద్వారా గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేసి.. వచ్చే ఎన్నికలకు నాయకులు - కార్యకర్తలను పూర్తిస్థాయి ఉత్సాహంలో ఉంచాలని నిర్ణయించిన అధినేత మిగిలిన కార్పోరేషన్లు - ప్రధాన దేవస్థానాలపై దృష్టి పెట్టారు. పదవుల భర్తీ త్వరగా పూర్తిచేసి.. పూర్తిగా పార్టీ కార్యకలాపాలపై క్యాడర్‌ను దృష్టి నిలిపేలా చేయాలన్నది ముఖ్యమంత్రి అభిమతంగా చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 30కార్పోరేషన్లు ఉండగా.. ఇప్పటివరకు 14కార్పోరేషన్ల చైర్మన్ ల పదవులను భర్తీ చేశారు. పదవుల భర్తీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమనేతలకు, పార్టీని ఆది నుండి అంటిపెట్టుకున్నవారికి ఇస్తున్న ప్రాధాన్యంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సారి భర్తీ చేసే పదవుల్లో గతంలో హామీ పొందిన ఎమ్మెల్యేలతో పాటు పలువురు మహిళలు.. విద్యార్ధి నేతలు ఉండొచ్చని భావిస్తున్నారు. కార్పోరేషన్లతో పాటు వేములవాడ రాజన్న, భద్రాచలం సీతారామచంద్రస్వామి వంటి ప్రధాన ఆలయాలకు పాలకమండళ్ళను నియమించే అవకాశం కనబడుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/