Begin typing your search above and press return to search.
కేసీఆర్ సిత్రం.. వారికేమో మూడేసి పోస్టులు.. వీరికేమో పోస్టులే లేవు
By: Tupaki Desk | 20 Aug 2021 4:12 AM GMTమాటలు చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. చేతలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయని చెబుతారు. ఆయన ఎప్పుడు రివ్యూలు చేస్తారో.. ఎప్పుడు ఏ పథకం గురించి ఆలోచిస్తారో అర్థం కాదంటారు. ప్రతి నిర్ణయం రాజకీయ కోణంలో చూస్తున్నారన్న విమర్శను కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. విడి రోజుల్లో తన మానాన తాను ఫాంహౌస్ లో ఉండే ఆయన.. ఉన్నట్లుండి ఒక్కసారి యాక్టివ్ అవుతారని.. మిగిలినరోజుల్లో మాత్రం అందుకు భిన్నంగా కామ్ గా ఉంటారని చెబుతున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో యాక్టివ్ గా మారిన ఆయన.. అప్పటికప్పుడు దళితబంధు పథకాన్ని తీసుకురావటం.. తెర వెనుక మంత్రాగాన్ని సిద్ధం చేయటంతో పాటు.. గతానికి భిన్నమైన చురుకును ప్రదర్శిస్తున్నారు. పాలనా పరంగా చూస్తే.. కేసీఆర్ తీరును పలువురు నేతలే కాదు అధికారులు సైతం తప్పు పట్టే పరిస్థితి. సాధారణంగా ఐపీఎస్ అధికారులు.. కీలక పదవుల్లో ఉన్న వారిని రెండేళ్లకోమారు మార్చటం.. వారిని బదిలీ చేయటం చేస్తుంటారు. అందుకు భిన్నంగా మూడేళ్లు గడుస్తున్నా.. ఐపీఎస్ ల బదిలీలు జరగకుండా ఎక్కడి వారిని అక్కడే ఉంచేయటం సరికాదన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఐపీఎస్ ల విషయంలో ఇలా ఉంటే.. రాష్ట్రంలో ఐఏఎస్ ల పరిస్థితి మరింత సిత్రంగా మారింది. కొందరికి మూడు.. నాలుగేసి శాఖల పనుల్ని అప్పగించేస్తుంటే.. మరికొందరు ఐఏఎస్ అధికారులకు ఎలాంటి పనులు ఇవ్వకుండా ఖాళీగా ఉంచేయటం విమర్శలకుతావిస్తోంది. వెయిటింగ్ లో ఉన్న వారికి పోస్టింగులు ఇవ్వనిప్రభుత్వం.. కొందరు అధికారులకు మాత్రం బాధ్యతల బరువును భారీగా పెంచేస్తున్న పరిస్థితి. దీంతో.. పాలనా పరమైన సమస్యలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కొత్త కేడర్ పోస్టులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ తీరును సీనియర్ అధికారులు తప్పు పడుతున్నారు.
పలువురు ఐఏఎస్ లకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టి..మరికొందరు కావాలని అడగటంలో అర్థం లేదంటున్నారు. 2018 ఎన్నికల వేళలో దాదాపు 50 మందికి పైనే ఐఏఎస్ లను బదిలీ చేసిన తెలంగాణ సర్కార్ ఆ తర్వాత మళ్లీ బదిలీ చేయలేదని చెబుతున్నారు. అప్పుడప్పడు ఒకటి అరా చేసినా.. అదంతా ముఖ్యమంత్రి చొరవతో చేస్తున్నవే తప్పించి.. మరింకేమీ కాదంటున్నారు. రాష్ట్ర సీఎస్ గా వ్యవహరిస్తున్న సోమేశ్ కుమార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు.. రెవెన్యూ.. వాణిజ్య పన్నులు.. స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇవి కాక మరిన్ని అంశాల్లోనూ ఆయన పాత్ర ఉంటుంది. దీంతో.. అన్ని శాఖలు దగ్గర ఉంచుకొని ఏ శాఖకు న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది.
రోడ్లు.. భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సునీల్ శర్మకు రవాణా శాఖతో పాటు ఆర్టీసీ ఎండీ పోస్టులు అదనంగా ఉన్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు సమాచార, పౌర సంబంధాల కమిషనర్ పోస్టుతో పాటు, హెచ్ఎండీఏ కమిషనర్ పోస్టు అదనంగా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. పలువురు సీనియర్ అధికారులకు మూడు.. నాలుగేసి శాఖల్ని అదనంగా కట్టబెట్టారు. దీంతో.. వారంతా వర్కు లోడుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమకు అప్పగించిన పనులకు వారు న్యాయం చేయలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే.. మరోవైపుకొందరు అధికారులకు ఎలాంటి శాఖను అప్పజెప్పకుండా ఖాళీగా ఉంచుతున్నారు. దీంతో వారంతా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. యాదాద్రి - భువనగిరి జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన అనితా రామచంద్రన్ ను బదిలీ చేశారు. ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. 2020లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా ఉన్న మహ్మద్ అబ్దుల్ అజీం.. మేడ్చల్ - మల్కాజిగిరి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లను బదిలీ చేసి వెయింటింగ్ లో ఉంచారు.
2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి శశాంక జులై నుంచి వెయిటింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం మేడ్చల్- మల్కాజిగిర, భద్రాద్రి - కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాలకు కలెక్టర్లు లేరు. వెయిటింగ్ లో ఉన్న వారికి పదవులు అప్పగించొచ్చు. కానీ.. అటు ఖాళీలు భర్తీ చేయకుండా.. ఇటు పదవులు ఇవ్వకుండా ఉంచటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. అంతకంతకూ పెరుగుతున్న విమర్శల్ని సీఎం కేసీఆర్ ఏ రీతిలో అధిగమిస్తారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.