Begin typing your search above and press return to search.

నో డౌట్‌.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప‌క్క‌కు వెళ్లిన‌ట్లే!

By:  Tupaki Desk   |   2 July 2018 3:37 AM GMT
నో డౌట్‌.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప‌క్క‌కు వెళ్లిన‌ట్లే!
X
ఎప్పుడేం చెబుతారో.. ఎవ‌రిని టార్గెట్ చేస్తార‌న్న విష‌యం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ విష‌యంలో అంచ‌నా క‌ట్ట‌టం అంత తేలికైన విష‌యం కాదు. చాలా అంశాల్ని ప్ర‌స్తావించే ఆయ‌న‌.. అందులోని ముఖ్య‌మైన అంశాల్ని కొన్నిసార్లు అదేప‌నిగా తెర మీద‌కు తీసుకొస్తారు. మ‌రికొన్నిసార్లు అస్స‌లే ప్ర‌స్తావ‌న తీసుకురారు.

ఎప్పుడేం మాట్లాడించాల‌న్న విష‌యంపై ఆయ‌న క్లారిటీ చాలా ఎక్కువ‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న వ్యూహ‌ర‌చ‌న ఉంటుంద‌న్న మాటను ఆయ‌న స్న‌నిహితులు సైతం చెబుతుంటారు. ఆ మ‌ధ్య‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఆయ‌న చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. మెచ్చుకోవ‌టంలో ఎంత తీవ్ర‌త ఉంటే.. అందుకు రెట్టింపు తప్పు ప‌ట్ట‌టంలోనూ ఉంటుంది. ఈ త‌ర‌హాలోనే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ వ‌స్తుంద‌ని.. ప‌లు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్న తాను జాతీయ స్థాయిలో భారీ మీటింగ్ పెట్ట‌నున్న‌ట్లుగా ప‌లు ఊరింపు మాట‌ల్ని తెర మీద‌కు తెచ్చారు.

అయితే.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ ను తాజాగా ప‌క్క‌న పెట్టేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో త‌న‌కు తిరుగులేద‌న్న విష‌యాన్ని త‌ర‌చూ చెప్పుకునే కేసీఆర్‌.. వాస్త‌వానికి అలాంటి ప‌రిస్థితి లేద‌న్న‌ట్లుగా ఆయ‌న తాజా నిర్ణ‌యాలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ ను తెర మీద‌కు తీసుకొచ్చిన కేసీఆర్‌.. త‌న‌కు తానే ఆ జెండాను ప‌క్క‌న పెట్టేశార‌ని చెప్పాలి. తాజాగా మాజీ ప్ర‌ధాని దెవేగౌడ సైతం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ప్ర‌స్తావించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికిప్పుడు ఫెడ‌ర‌ల్ ప్రంట్ ప్ర‌స్తావ‌న తెర మీద‌కు తెచ్చుకోవ‌ద్ద‌ని.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత‌నే.. కాంగ్రెస్‌.. బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను తెర మీద‌కు తీసుకొస్తే బాగుంటుంద‌న్న మాట‌ను కేసీఆర్ తో అన్న‌ట్లు తెలిసింది. అదే స‌మ‌యంలో కేసీఆర్ స్పందిస్తూ.. ప్ర‌స్తుతం త‌మ‌ ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాల గురించి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టు గొప్ప‌త‌నాన్ని దెవౌడ‌కు కేసీఆర్ ఘ‌నంగా చెప్పుకోగా.. ఈసారి తాను హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన‌ప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును త‌ప్ప‌నిస‌రిగా సంద‌ర్శిస్తాన‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అమ‌లు చేసిన రుణ మాఫీ అంశాన్ని దెవేగౌడ ప్ర‌శ్నించిన‌ట్లుగా తెలిసింది. మొత్తంగా చూస్తే ఇరువురు నేత‌ల మ‌ధ్య సామాన్య‌మైన విష‌యాలే కానీ.. జాతీయ రాజ‌కీయాల్ని ప్ర‌భావితం చేసేలా నిర్ణ‌యాలు లేవ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.