Begin typing your search above and press return to search.
కేసీఆర్ దండయాత్ర.. సైనికులు ప్రజలేనా?
By: Tupaki Desk | 28 March 2019 6:30 AM GMTఒక రైతుకు చెందిన 7 ఎకరాల్ని వీఆర్వో కారణంగా జరిగిన తప్పునకు ఆ భూమి వేరే వారి సొంతమైంది. తాతల నుంచి వస్తున్న భూమి వేరేటోడిదంటే ఎవరికి మాత్రం కడుపు మండదు. అలానే ఆ బక్క రైతు కడుపు మండింది. గుండె పగిలింది. వేదనతో ఏడుస్తూ ఇంట్లో కూర్చోకుండా వాళ్లని.. వీళ్లని కలుస్తూ.. న్యాయం కోరుతూ పోరాడుతున్నాడు. ఎంత తిరిగినా.. మరెంత పోరాడినా ఏం లాభం? ఎవరు రియాక్ట్ కావట్లేదని ఊరుకోకుండా సోషల్ మీడియాలోనూ ప్రయత్నాలు షురూ చేశాడు.
తనకు జరిగిన అన్యాయంపై గళం విప్పాడు. సీఎం కేసీఆర్ వరకూ తన సమస్య వెళ్లేలా షేర్ చేయాలని నెటిజన్లను కోరాడు. ఆ రైతు కోరుకున్నట్లే జరిగింది. అతడి సమస్య కేసీఆర్ వరకూ వెళ్లింది. ముఖ్యమంత్రే స్వయంగా ఫోన్ చేసి ఆ రైతు సమస్యను మరోసారి తెలుసుకొని..అతడికి న్యాయం చేశారు. ఇక్కడితో ఈ కథ ముగిస్తే ఆయన సీఎం కేసీఆర్ ఎందుకు అవుతారు?
తన దృష్టికి వచ్చిన ఒక ఇష్యూ మూలాల్లోకి వెళ్లటమే కాదు.. దానికి తాత్కాలిక పరిష్కారం కంటే కూడా శాశ్విత సొల్యూషన్ సంగతి చూసే అలవాటు సీఎం కేసీఆర్‌లో ఎక్కువే. తాజాగా రైతు శరత్ ఇష్యూలోనూ డీప్ గా వెళ్లారు. నీ ఒక్కడి సమస్య కాదు శరత్.. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందన్న ఆయన.. రెవెన్యూ శాఖ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కలలో కూడా ఊహించని రీతిలో రెవెన్యూ శాఖపై తాను యుద్ధం చేయనున్న సంకేతాన్ని తన మాటల శ్లేషతో చెప్పేశారు.
ఈ వాదనకు బలం చేకూరేలా కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. రైతు శరత్ తో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లోని కొన్ని కీలక సంభాషణల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు.. తాను రెవెన్యూ శాఖ మీద చేసే పోరుకు సామాన్యులు తన సైనికులుగా ఎంచుకోవటం విశేషం.
రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసే సమయంలో సమ్మె చేసే ఆలోచన చేస్తారని.. అలాంటి వేళ ప్రజలు చైతన్యమై ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ మాటల్ని జాగ్రత్తగా గమనిస్తే.. అవినీతిమయమైందన్న ఆరోపణలు ఎదుర్కొనే రెవెన్యూ శాఖను రద్దు చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారా? అన్న సందేహం రాక మానదు. దీనికి ఎన్నికలు పూర్తి అయ్యాక.. జూన్ లో ముహుర్తాన్ని పెట్టేశారన్న విషయం అర్థమయ్యేలా ఆయన మాటలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే.. సీఎం కేసీఆర్ మరో సంచలనానికి తెర తీసినట్లే.
రెవెన్యూ శాఖ సంగతి చూస్తానన్న మాట కేసీఆర్ నోటి నుంచి రావటమే కాదు.. ఆయన చేసిన కీలక వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే.. (రైతు శరత్ తో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడిన సంభాషణల్లోని ముఖ్యమైన వ్యాఖ్యలు చూస్తే)
+ వీఆర్వో గాళ్లు ఎంత పనిచేస్తరు చూడు. నీ సమస్య కాదు.. శరత్! మొత్తం రాష్ట్రంలో ఇదే దందా. ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి పాతుకుపోయి ఉంది. పూర్తిగా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. రెవెన్యూ అంటే వీళ్లే చేయాలనేది మన బలహీనత. అట్ల లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నయి.
+ వీళ్లంతా రాష్ట్రం మొత్తంగా సమ్మె చేసే ఆలోచనలో ఉన్నరు. రోజూ డబ్బులు జేబులో పెట్టుకొని పోతరు కదా? వీనిది వానికి రాసి, వానిది వీనికి రాసి పోతుంటరు కదా! దాంట్లో భాగంగనే మీది కూడా జరిగింది.
+ ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు మీలాంటోళ్లు అంతా గ్రౌండ్ లో నిలబడాలె. ప్రజలను సమీకరించాలి.
+ సామాజికపరంగా సమస్య వస్తే నోటి మాటతో పోదు కదా! పోవాలంటే కచ్చితంగా సమాజం అంతా ఒక్కటి కావాలె. పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చా. చాలా చాలా కఠినంగా ఉంది. జూన్ తర్వాత కొన్ని వేల మంది సర్పంచులు ఎగిరిపోతరు.. పనిచేయకపోతే. నేను చెప్పినా పేపర్‌లో వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ వాడైతే ఆడనే తీసేయాలె అని చెప్పిన.
+ మనం ధరణి వెబ్ సైట్ తెద్దామని ప్రయత్నం చేస్తున్నం.. జూన్‌లో వస్తది. రైతుకు ఎమ్మార్వో ఆఫీసుకు పోయే పనే ఉండదు. ఎవ్వల రికార్డు వాళ్లకే ఉంటది. ధరణి వెబ్ సైట్ వస్తే నీ సమస్య - నా సమస్య కాదు...మొత్తం రైతుల బాధలు పోతాయి.