Begin typing your search above and press return to search.

బంగారు తెలంగాణ నిర్వ‌చ‌నం చెప్పిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   30 Dec 2017 4:39 AM GMT
బంగారు తెలంగాణ నిర్వ‌చ‌నం చెప్పిన కేసీఆర్‌
X
తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌మే ధ్యేయంగా ప‌ని చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. పుష్క‌ర కాలం పాటు ఎన్నో ఆటుపోట్ల‌తో చివ‌ర‌కు తాను అనుకున్న‌ట్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు అయ్యేలా చేసుకోగ‌లిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డినంత‌నే.. దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో ద‌ళితుడ్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని.. తెలంగాణ జాతిపిత‌గా తాను ఆవిర్భ‌విస్తాన‌న్న‌ట్లు చెప్పుకున్నారు. ఇచ్చిన మాట త‌ప్ప‌టం త‌న వంశంలోనే లేద‌ని.. తెలంగాణ వ‌చ్చినంత‌నే రాజ్యాధికారం మొత్తం ద‌ళితుల‌కేనంటూ ప్ర‌క‌టించేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఏం జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన త‌ర్వాత‌.. కేసీఆర్ త‌న త‌ర్వాతి ల‌క్ష్యం ఏమిటో తెర మీద‌కు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌ని.. ఇక బంగారు తెలంగాణ సాధ‌నే త‌న త‌ర్వాతి ల‌క్ష్యంగా చెప్పుకున్నారు. బంగారు తెలంగాణ అంటే ఏమిటో ఆయ‌న వివ‌రంగా చెప్ప‌న‌ప్ప‌టికీ.. ఎప్ప‌టిక‌ప్పుడు బంగారు తెలంగాణ సాధ‌న‌లో భాగంగా ప‌లువురు ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల్ని.. ఎంపీల‌ను త‌మ పార్టీలోకి చేర్చుకోవ‌టం.. జంపింగ్ ప్ర‌జాప్ర‌తినిధులు.. తాము బంగారు తెలంగాణ సాధ‌న కోస‌మే పార్టీ మారి వ‌చ్చేసిన‌ట్లు చెప్పుకున్నారు.

ఇలా..చిత్ర‌విచిత్ర‌మైన కార్య‌క‌లాపాల‌కు బంగారు తెలంగాణ పేరును స్వేచ్ఛ‌గా వాడేసిన క్ర‌మంలో.. అస‌లు బంగారు తెలంగాణ అంటే ఏమిటి బాసు? అన్న సందేహం ప్ర‌ముఖంగా మారింది. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌పై విప‌క్షాలు విరుచుకుప‌డుతున్న వేళ‌.. బ్ర‌హ్మ ప‌దార్థంగా మారిన బంగారు తెలంగాణ వ్య‌వ‌హారాన్ని ఒక్క మాట‌లో తేల్చేశారు.

బంగారు తెలంగాణ అంటే ఏమిటో కాద‌ని.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకోవ‌ట‌మేన‌ని తేల్చేశారు. గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి వేగంగా జ‌రుగుతోంద‌ని.. కుల‌వృత్తుల‌పై ఆధార‌ప‌డ్డ వారికి ఆర్థిక స‌హ‌కార‌మిస్తూ సంప‌ద‌ను సృష్టిస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. బంగారు తెలంగాణ అంటే ఏమిటో అంటూ త‌ల‌లు బ‌ద్ధ‌లు కొట్టుకునే వారి ఇబ్బందిని తొల‌గిస్తూ.. సింఫుల్ గా.. అంద‌రికి అర్థ‌మ‌య్యే రీతిలో చెప్పేసిన కేసీఆర్ కు స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్పాల్సిందే. సో.. బంగారు తెలంగాణ అంటే ఇక‌పై ఎవ‌రికి ఎలాంటి డౌట్లు లేవుగా..?