Begin typing your search above and press return to search.
మళ్లీ ఢిల్లీకి కేసీఆర్..ఆరోగ్యానికి ఏమైంది?
By: Tupaki Desk | 27 May 2018 10:57 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు హస్తిన బాట పట్టారు. ఏకకాలంలో ఇటు ప్రజా సమస్యలు అటు ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకునేందుకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇవాళ ఢిల్లీ వెళుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు రోజుల పాటు అక్కడే ఉంటారు. తాజాగా జరుగుతున్న మంత్రివర్గ సమావేశం అనంతరం వెంటనే ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలకు పరిష్కారం చూపడంతో పాటుగా తన ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరించుకోనున్నారు.
టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన కొత్త జోనల్ విధానంపై మంత్రిమండలిలో తీర్మానం చేయించిన వెంటనే దాని ప్రతిని తీసుకొని స్వయంగా కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. ప్రధాని మోడీని కలిసి కొత్త జోనల్ విధానం అమలు కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పును కోరే తీర్మానాన్ని అందజేస్తారు. రాష్ట్రపతి ద్వారా ఆమోదం ఇప్పించాలని కోరతారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగు అంశాలు, ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు వంటి ఇతర అంశాలపైనా ప్రధానితో కేసీఆర్ చర్చించే వీలుంది.ప్రధానితో కేసీఆర్ సమావేశం మంగళవారం ఉండే వీలుంది. ప్రధానితో భేటీకి ముందు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కూడా కేసీఆర్ కలవనున్నారని సమాచారం.
కాగా, ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి దంత వైద్య పరీక్షలు కూడా చేయించుకుంటారని సమాచారం. గతంలో నిర్వహించుకున్న ఆపరేషన్ విజయవంతం అయిన నేపథ్యంలో తాజా పరీక్షను కూడా ఢిల్లీలోనే చేయించుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారని సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంటి ఆపరేషన్ విజయవంతమైన సంగతి తెలిసిందే. కొద్దికాలంగా కంటి సమస్యతో బాధపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రికి ఢిల్లీలో గత మార్చిలో శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. సుప్రసిద్ధ కంటి వైద్య నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సెంటర్ ఫర్ సైట్ (సీఎఫ్ఎస్) చైర్మన్ డాక్టర్ మహిపాల్ ఎస్ సచ్‌దేవ్ ఢిల్లీలో కేసీఆర్‌కు ఆపరేషన్‌ను నిర్వహించారు. ఆ సమయంలో మంత్రులు కే తారకరామారావు - హరీశ్‌రావు - ఎంపీ కవిత - ఇతర కుటుంబసభ్యులు అక్కడే ఉన్నారు. ఇప్పుడు అదే రీతిలో ఢిల్లీని నమ్ముకోవాలని ఆయన భావిస్తున్నట్లుగా చెప్తున్నారు.