Begin typing your search above and press return to search.

కేసీఆర్ మరో బిగ్ మిస్టేక్.. పెద్ద దెబ్బే?

By:  Tupaki Desk   |   26 Dec 2019 4:55 AM GMT
కేసీఆర్ మరో బిగ్ మిస్టేక్.. పెద్ద దెబ్బే?
X
2019.. సార్వత్రిక ఎన్నికల సమరం.. అప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన కేసీఆర్ ఎంపీ ఎన్నికలకు సమరోత్సాహంతో రెడీ అయ్యారు. కరీంనగర్ లో టీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కోసం ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేస్తూ ‘దేశంలోనే పెద్ద హిందువును నేనే.. నాలెక్క ఎవడైనా ఇన్ని యాగాలు - హోమాలు చేశాడా?.. హిందువుల బొందువులా?’ అంటూ నోరు జారారు.

కేసీఆర్ ‘హిందువులా.. బొందువులా’ అనే మాట కలిగించిన నష్టం అంతా ఇంతాకాదు.. బీజేపీకి అదో అస్త్రంగా మారి.. విస్తృతంగా ప్రచారం చేసింది. హిందువులను టచ్ చేసింది. కరీంనగర్ - నిజామాబాద్ - సికింద్రాబాద్ లలో బీజేపీ ఎంపీల విజయంలో కేసీఆర్ తూలిన ఈ మాట కూడా ప్రచారాస్త్రంగా మారి ఆయన ఓటమికి దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పుడు కేసీఆర్ అదే రాంగ్ స్టెప్ వేస్తున్నారు. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందర బీజేపీకి ఎక్కడ దొరకకూడదో అక్కడే దొరికిపోతున్నారన్న చర్చ మొదలైంది.

పౌరసత్వ సవరణ చట్టం - ఎన్నార్సీలకు మద్దతివ్వాలని నిన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని కలిసి కోరడం.. కేసీఆర్ దానికి సరేననడం పెద్ద మిస్టేక్ గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 30న గాంధీవర్ధంతి రోజున హైదరాబాద్ లో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా భారీ బహిరంగసభకు ప్లాన్ చేశారు.ముస్లింలు - లౌకికవాద శక్తులకు మద్దతుగా పోరాటానికి పూనుకుంటున్నారు. ఈ పరిణామాన్ని మళ్లీ బీజేపీ వాడుకొని హిందుత్వ ఎజెండాతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో లాభపడే అవకాశాలున్నాయంటున్నారు. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ వేస్తున్న ఈ అడుగు ఆయనకు మైనస్ అంటున్నారు. మరి దీని పరిణామం ఎటు దారితీస్తుందనేది వేచిచూడాలి..