Begin typing your search above and press return to search.
బీజేపీని కెలికి కేసీఆర్ ఖరీదైన తప్పు చేశారా?
By: Tupaki Desk | 9 Nov 2020 5:30 AM GMTకొన్ని తప్పుల్ని అస్సలు చేయకూడదు. రాజకీయంగా ఎంత తిరుగులేని అధిక్యత ఉన్నప్పటికీ.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేసే తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి తప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారా? అన్నది చర్చగా మారింది. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో మూడో స్థానానికి పరిమితమవుతుందని భావించిన బీజేపీ.. ఇప్పుడు రెండో స్థానంలో నిలవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ను పక్కకు తప్పించేందుకు.. బీజేపీని తెర మీదకు తీసుకొచ్చి.. దిద్దుకోలేని తప్పు చేశారన్న మాట బలంగా వినిపిస్తోంది. గడిచిన కొద్దికాలంగా రాజకీయంగా తిరుగులేని రీతిలో చెలరేగిపోయిన ఆయన.. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా అనుసరించిన వ్యూహం ఎదురుదెబ్బ కొట్టే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో..ఎప్పుడూ లేనంత పోటీని బీజేపీ ఇచ్చిందని చెప్పాలి. అదే సమయంలో.. టీఆర్ఎస్ కు సరైన ప్రత్యర్థి బీజేపీ అన్న భావన ప్రజల్లో కలిగితే.. కసీఆర్ కు కలిగే నష్టం భారీగా ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పటివరకు తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఉన్న సరైన రాజకీయ పార్టీ అన్నదే లేదు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఒకటి ఉందన్న విషయం దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బయటకు వచ్చింది. ఆ భావన బలం చేకూరేలా ఫలితంలో కనిపిస్తే.. ఇప్పటికే కేసీఆర్ మీద గుర్రుగా ఉన్న సొంత పార్టీ నేతలు సైతం జంప్ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే ఉన్న నాయకత్వానికి అదనపు బలం చేకూరితే.. తమ సత్తా చాటాలని తెలంగాణ బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు పలువురు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోవటంతో ఆ పార్టీ బలహీనమైంది. ఇలాంటివేళ..కొత్త ఉత్సాహంతో దూసుకెళుతున్న బీజేపీకి దుబ్బాక ఒక బలవర్థకమైన టానిక్ గా మారింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవకున్నా ఫర్లేదు.. టీఆర్ఎస్ ను ఎదిరించే సత్తా తమకుందన్న సందేశాన్ని ఇచ్చేలా ఫలితం ఉంటే చాలంటున్నారు. దుబ్బాక ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఇదంతా చూస్తే.. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీని కెలక్కుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.