Begin typing your search above and press return to search.

యాదాద్రిలో అంతసేపు ఉన్నాఅక్కడకు మాత్రం వెళ్లని కేసీఆర్

By:  Tupaki Desk   |   8 Feb 2022 6:30 AM GMT
యాదాద్రిలో అంతసేపు ఉన్నాఅక్కడకు మాత్రం వెళ్లని కేసీఆర్
X
రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన కలల రూపానికి ప్రతిరూపంగా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటైన తర్వాత.. ఏపీలో ఎలాగైతే తిరుమల ఉన్నదో అదే రీతితో యాదాద్రిని తయారు చేయాలని భావించటం.. అందుకోసం వందల కోట్లు ఖర్చు చేసి.. వచ్చే నెల 28న యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాన్ని చేపట్టనుండటం తెలిసిందే.

యాదాద్రిని ఏ రీతిలో సిద్ధం చేయాలన్న అంశంపై కేసీఆర్ కు స్పష్టమైన ఆలోచన ఉందన్న విషయం తెలిసిందే. ఆ మాటకు వస్తే.. యాదాద్రిలో ఏర్పాటయ్యే ప్రతి అంశం ఆయన స్వయంగా చూసి ఓకే చెప్పినదే. యాదాద్రి పనుల కోసం ఆయనఇప్పటికే పలుమార్లు రావటం.. వచ్చిన ప్రతిసారీ ప్రధానాలయానికి వెళ్లటం.. అక్కడే ఉండి అధికారులకు సూచనలు చేయటం లాంటివి చేసేవారు. కనీసం గంట పాటు ప్రధాన ఆలయంలో ఉండటం ఆయనకో అలవాటుగా చెబుతారు.

అలాంటి కేసీఆర్ తాజా పర్యటనలో మాత్రం కాస్తంత భిన్నంగా వ్యవహరించారు. ప్రధాన ఆలయానికి అస్సలు వెళ్లకపోవటం విశేషంగా చెప్పాలి. సోమవారం దాదాపు ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో ఉండి.. ఆలయ ఏర్పాట్ల మీద సుదీర్ఘంగా అధికారులతో చర్చించిన ఆయన.. ఆలయంలో పనులు జరుగుతున్న ప్రతి భాగాన్ని చూశారు. సలహాలు.. సూచనలు అందించారు. లిఫ్ట్ ద్వారా బాలాలయంలోకినిక చేరుకొని కొండపై జరుగుతున్న పనులను పరిశీలించారు.

బాలాలయంలో కవచమూర్తుల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన.. ఆర్చకుల మండపంలో చతుర్వేదాలతో ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి శేషవస్త్రాల్ని సీఎంకు అందజేశారు. ఇంతచేసిన ఆయన.. ప్రధాన ఆలయానికి వెళ్లకపోవటం మాత్రం ఆసక్తికరంగా మారింది. యాదాద్రి పనులు ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 16 సార్లు వచ్చిన ఆయన.. ఎప్పటి మాదిరి ప్రధాన ఆలయానికి మాత్రం వెళ్లకపోవటం ఈసారి టూర్ ప్రత్యేకతగా చెప్పక తప్పదు