Begin typing your search above and press return to search.
ఆ నలుగురిని వదలని కేసీఆర్..
By: Tupaki Desk | 16 Nov 2022 2:30 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసినా దానికి అర్థం పరమార్థం ఉంటుంది. కీలక ఆపరేషన్లు చేసినప్పుడు అందుకు సహకరించిన వారిని అందలం ఎక్కిస్తుంటారన్న పేరుంది. ‘ఓటుకు నోటు ’ కేసులో చంద్రబాబు, రేవంత్ రెడ్డిని పక్కాగా పట్టించిన పోలీస్ అధికారులకు ప్రమోషన్ ఇచ్చి వారిని ఉన్నత స్థానాల్లో కేసీఆర్ నియమించి నాడు సత్కరించారు. ఆయాచిత లబ్ధి చేకూర్చాడని టాక్ ఉంది.
ఇప్పుడు ఫాంహౌస్ కొనుగోళ్లలో బీజేపీని బుక్ చేసిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ కేసీఆర్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఫాంహౌస్ డీల్స్ లో పాల్గొన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రగతిభవన్ కు చేరుకొని కేసీఆర్ తోపాటు రెండు మూడు రోజులు ఉన్నారు. ఇక వారు బయటకు వచ్చాక కూడా భద్రత పెంచారు. వారిని నియోజకవర్గాలకు వెళ్లనీయడం లేదు. హైదరాబాద్ లోనే ఉన్నారని.. కేసీఆర్ వెంటే ఉంటున్నారని సమాచారం.
ఇటీవల ప్రెస్ మీట్ కు ఈ నలుగురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకొనే కేసీఆర్ హాజరయ్యారు. ప్రెస్ మీట్ లో పక్కనే కూర్చుండబెట్టుకున్నారు. గన్ మెన్లను పెంచి గట్టి భద్రత కల్పించారు. ఇటీవల యూపీ, గుజరాత్ నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వస్తే పోలీసులతో కేసులు పెట్టించారు.
ఇక తాజాగా టీఆర్ఎస్ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశానికి కూడా ఈ నలుగురు కేసీఆర్ కాన్వాయ్ లోనే రావడం విశేషం. దీంతో వారు ఇంకా ప్రగతి భవన్ లోనే ఉన్నారా? అన్న సందేహాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఫాంహౌస్ డీల్స్ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. రోహిత్ రెడ్డి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. మిగతా ముగ్గురివి తీసుకుంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలను బయట కనిపించకుండా.. నియోజకవర్గాలు, మీడియాకు దూరంగా కేసీఆర్ కాపు కాస్తున్నాడు. వారి భద్రత, లీకేజీలు బయటపడకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఈగుట్టు బయటపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.