Begin typing your search above and press return to search.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా..: టీఆర్ఎస్ కు ముందు నుయ్యి .. వెనుక గొయ్యి..?
By: Tupaki Desk | 5 Aug 2022 9:30 AM GMTఉప ఎన్నికలంటే కేసీఆర్ కు ఒకప్పుడు చాలా ఇష్టం. ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా ఆయన పలు సార్లు తన పదవులకు రాజీనామాలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు జరిగేట్లు చూశారు. ఆ తరువాత తన చాకచక్యంతో గెలిచేవారు. మొన్నటి హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకు ఈ సాంప్రదాయం అలాగే కొనసాగింది. టీఆర్ఎస్ పై ఆరోపణలు చేసిన ఈటల రాజేందర్ ను వెంటనే రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నందున ఈటలను ఓడించి పార్టీ ప్రతిష్ట పెంచుకోవాలని చూశారు.
ఈ పరిణామాల మధ్య ఈటల తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఉప ఎన్నికలంటే కేసీఆర్ కు భయం పట్టుకుందట. తన పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయంలో టీఆర్ఎస్ నాయకులు ఉత్సాహం చూపడం లేదట. అయితే అందుకు పెద్ద కారణమే ఉంది..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందించాలని చూస్తున్నాడు. అయితే తాను స్పీకర్ ను కలిసేందుకు నాలుగు రోజలు సమయం పెట్టారట. రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్ అందుకొని.. దానిని ఆమోదించాలి. కానీ కేసీఆర్ తలుచుకుంటే ఇది ఒక్కరోజులోనే అయ్యే పని. కానీ రాజగోపాల్ రెడ్డి నుంచి రాజీనామా లేఖను అందుకోవడానికే సమయం పెట్టారు. ఇక ఆమోదించడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. ఈ పరిస్థితుల్లో అసలు మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందా..? అనే చర్చ సాగుతోంది.
టీఆర్ఎస్ లో మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ ను మంత్రిగా సస్పెండ్ చేశారు. ఆ తరువాత టీఆర్ఎస్ పై ఈటల పలు ఆరోపణలు చేశారు. అయితే కేసీఆర్ నేరుగా కాకుండా తమ పార్టీ నాయకులతో రాజీనామా చేయించేలా ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి దమ్ముంటే పార్టీకి, పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో తమ పార్టీ ఉన్నందున గెలుపు ఈజీ అనుకున్నారు. కానీ ఈటల రాజీనామా చేసి బీజేపీలో చేరడం.. ఆ తరువాత గెలుపొందారు.
ఇప్పుడు మునుగోడు విషయంలో టీఆర్ఎస్ నాయకులు అంతటి ఉత్సాహాన్ని చూపడం లేదు. కనీసం ఆ పార్టీకి చెందిన చానెళ్లలోనూ ఎలాంటి వార్తలు రావడం లేదు. రాజగోపాల్ రెడ్డి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు సైతం ఈ విషయంలో ఏ విధంగానూ స్పందించడం లేదు. ఓ వైపు రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను ఆమోదించకపోవడంతో పాటు మరోవైపు.. రాజీనామా డిమాండ్ లేకపోవడంతో అసలు మునుగోడు ఉప ఎన్నిక రావాలని కేసీఆర్ కోరుకోవట్లేదా..? అన్న చర్చ సాగుతోంది. ఇందులో భాగంగానే స్పీకర్ రాజీనామా లేఖను అందుకోవడం లేదా..? అని అనుకుంటున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించడానికి సిద్ధంగా ఉంటేనే రాజీనామాను ఆమోదిస్తారు. కానీ ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాన్చుడు ధోరణి వ్యవహరిస్తుండడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఒకవేళ రాజీనామాను ఆమోదించకపోయినా టీఆర్ఎస్ కు విమర్శల బాధ తప్పదు. ఉప ఎన్నికకు భయపడుతుందన్న పేరు ప్రజల్లోకి వెళితే వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు ముందు నుయ్యి .. వెనుక గొయ్యి అన్నపరిస్థితి ఎదురైందని అంటున్నారు.