Begin typing your search above and press return to search.
ఛాతీ మీద పచ్చబొట్టు వేసుకున్న వీరాభిమాని తాజా మాట విన్నారా కేసీఆర్?
By: Tupaki Desk | 19 Nov 2021 4:30 PM GMTతాము అభిమానించే వారికి గుర్తుగా ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను అభిమానించే వారు ఎంత మందన్నది చెప్పటమే కష్టంగా ఉండేది. ఆ మాటకు వస్తే.. ఉద్యమం పీక్స్ కు చేరిన వేళ.. కేసీఆర్ ను పల్లెత్తు మాట అంటే చాలు కస్సుమనే తెలంగాణవాదులకు కొదవ ఉండేది కాదు. ఈ కారణంతోనే కొమ్ములు తిరిగిన నేతలు సైతం కేసీఆర్ ను ఒక మాట అనేందుకు వెనుకా ముందు ఆలోచించేవారు. ఒక మాట అనేందుకు విపరీతంగా సంశయించేవారు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జాతిపితగా అభివర్ణించే కేసీఆర్ మీద తమకున్న అభిమానాన్ని చాటుకోవటానికి చాలా మంది చాలా పనులు చేసేవారు. అలాంటి వారిలో ఒకరు ఎల్బీనగర్ కు చెందిన నారాయణ. ఆయనకు కేసీఆర్ అంటే విపరీతమైన అభిమానం. ఎంత అంటే.. కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో ఆయన తన ఛాతీ మీద కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు.. ఉద్యమాలు చేసిన నారాయణ.. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తమ బతుకులు మారతాయని బలంగా నమ్మారు. ఇప్పడుఆయనతీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారతాయని తాను అనుకన్నానని.. కేసీఆర్ మీద తనకున్న అభిమానంతో ఛాతీ మీద ఆయన పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నట్లు చెప్పారు.
అలాంటి కేసీఆర్ ఈ రోజున రైతులను.. ఉద్యమ నాయకుల్ని నట్టేల ముంచారన్నారు. అందుకే.. కేసీఆర్ ను బొంద పెట్టాలన్న తీవ్రమైన వ్యాఖ్య చేయటం గమనార్హం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన.. కేసీఆర్ చేస్తున్న ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో రేవంత్ ను ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన ఆత్మవిశ్వాసంతో చెప్పటం గమనార్హం.
ఒకప్పుడు తనను విపరీతంగా అభిమానించిన వీరాభిమాని ఇప్పుడు అందుకు భిన్నంగా చేస్తున్న వ్యాఖ్యల్నికేసీఆర్ గుర్తిస్తారా? తనకు కీలకమైన ఫీడ్ బ్యాచ్ ఇచ్చే వారిని ప్రత్యేకంగా ప్రగతిభవన్.. ఫాంహౌస్ (ఫార్మర్ హస్)కు పిలిపించుకునే రీతిలోనే నారాయణ లాంటి వీరాభిమానుల్ని పిలిపించుకొని మాట్లాడితే.. తాను చేస్తున్న తప్పులు అర్థమవుతాయేమో?