Begin typing your search above and press return to search.
కేసీఆర్ నిన్ననే చర్చించారట
By: Tupaki Desk | 30 Sep 2015 10:39 AM GMTనిష్టూరమే అయినా నిజాన్ని కేసీఆర్ చాలా చక్కగా అంగీకరించారు. దానిని కూడా అసెంబ్లీ సాక్షిగా అంగీకరించడం విశేషం. అది ఏమిటి అంటారా? రైతు ఆత్మహత్యలకు సంబంధించి సంబంధిత మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి - ఇతర అధికారులతో మంగళవారం రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల వరకు చర్చించారట. అది కూడా అసెంబ్లీ అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని, ఈ అంశం మీద మనం ఇకనైనా దృష్టి సారించాలని, ఏదో ఒక పరిస్కారం కనుగొనాలని భావించారట. ఈ విషయాలన్నీ సాక్షాత్తూ కేసీఆరే చెప్పారు.
తెలంగాణలో గత ఏడాది కాలంలో ఆత్మహత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా ఆత్మహత్యలు పెరిగాయి. 15 రోజులుగా తీవ్రమయ్యాయి. అయినా ఆత్మహత్యలకు సంబంధించి కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అసలు దాని గురించి మాట్లాడలేదు. ఆత్మహత్యల నివారణకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలోనే విమర్శలు వ్యక్తమైనా ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. మంగళవారం ప్రతిపక్షాలు మాట్లాడాయి. బుధవారం దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు కసరత్తు చేసుకోవాలి కదా. ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ఇలాగే ఉంటుంది. మంత్రులు, నాయకులతో సుదీర్ఘంగా సమావేశం అవుతారు. అక్కడ వచ్చిన విబిన్న అభిప్రాయాలలోంచి తన అభిప్రాయాలను వేరు చేసి ప్రజలకు తనదైన శైలిలో వివరిస్తారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తప్ప ఇప్పటి వరకు ప్రభుత్వపరంగా ఆ అంశంపై చర్చించలేదని కేసీఆర్ చెప్పకనే చెప్పారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.