Begin typing your search above and press return to search.

అంచ‌నాలు నిజం.. అసెంబ్లీని ర‌ద్దు చేసిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   6 Sep 2018 8:23 AM GMT
అంచ‌నాలు నిజం.. అసెంబ్లీని ర‌ద్దు చేసిన కేసీఆర్‌
X
అనుకున్న‌దే నిజ‌మైంది. అంచ‌నాలు ఏ మాత్రం త‌ప్పు కాలేదు. న‌మ్మ‌కాల‌కు పెద్ద‌పీట వేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న జాత‌క ల‌గ్నంలో బ‌ల‌మైన ముహుర్తం వేళ‌లో తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు నిర్ణ‌యాన్ని కేబినెట్ ఎదుట ప్ర‌క‌టించారు. రాజు చెప్పిందే వేదం.. ఆయ‌న ఏమంటే.. అదే త‌మ మాట అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తెలంగాణ మంత్రులంతా కేసీఆర్ మాట‌కు ఓకే చెప్పేశారు.

ఈ మ‌ధ్యాహ్నం (గురువారం) 1.20 గంట‌ల ప్రాంతంలో తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేస్తూ కేబినెట్ ఆమోదం వ్య‌క్తం చేసింద‌న్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. కేబినెట్ తీర్మానం ఓకే అయిన వెంట‌నే కేసీఆర్ త‌న మంత్రుల‌తో క‌లిసి రాజ్ భ‌వ‌న్ కు బ‌య‌లుదేర‌నున్నారు. అక్క‌డ త‌మ తీర్మాన ప్ర‌తిని ఆయ‌న‌కు అందించ‌నున్నారు. అసెంబ్లీ ర‌ద్దుకు సంబంధించిన నోటిఫికేష‌న్ ఈ సాయంత్రానికి వెలువ‌డుతుంద‌ని చెబుతున్నారు.

గ‌వ‌ర్న‌ర్ వద్ద‌కు తీర్మాన ప్ర‌తి ఇచ్చి.. ఆయ‌న ఆమోద ముద్ర ప‌డి.. నోటిఫికేష‌న్ వెలువ‌డిన వెంట‌నే తెలంగాణ ప్ర‌భుత్వం ర‌ద్దు కావ‌ట‌మే కాదు.. ఇప్ప‌టిదాకా ఉన్న ప‌ద‌వి ముందు మాజీ అన్న ప‌దం వ‌చ్చి చేర‌నుంది. గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అనంత‌రం గ‌న్ పార్క్ వ‌ద్ద‌కు వెళ్లి అమ‌రవీరుల‌కు నివాళులు అర్పించి.. అనంత‌రం మీడియాతో కేసీఆర్ మాట్లాడ‌నున్నారు.