Begin typing your search above and press return to search.
ఎనిమిదేళ్లలో కేసీఆర్ పంపకాలు ఇవే!
By: Tupaki Desk | 21 Jun 2022 6:11 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో ఇప్పటిదాకా లక్షా 51 వేల కోట్ల రూపాయలను పంచామని సంబంధిత వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. గ్రామీణ లబ్ధిదారులకే ఈ మొత్తాలను అందించామని కూడా చెబుతోంది. రైతు బంధు, ఆసరా, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, దళిత బంధు వంటి పథకాల రూపంలో ఈ మొత్తాలను పంపిణీ చేశామని, లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా వేశామని అంటున్నాయి. బాగుంది.. ఇంత భారీ మొత్తాలను పంచాక తెలంగాణ ప్రభుత్వం సాధించిందేంటి ?
వాస్తవానికి ఏపీతో పోలిస్తే తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు అన్నవి తక్కువేనట. ఏపీలో మూడేళ్లలో లక్షా నలభై వేల కోట్ల రూపాయలకు పైగా సొమ్ములు పంచామని వైసీపీ సర్కారు చెబుతుంటే, కేసీఆర్ సర్కారు మాత్రం ఎనిమిదిదేళ్లలో గ్రామీణ తెలంగాణకు లక్షా 51 వేల కోట్ల రూపాయలు అందించామని చెబుతున్నారు. ఏపీ కంటే చిన్న రాష్ట్రం కావచ్చు కానీ సమయం పెద్దది కదా.
ఇప్పటికే దళిత బంధు పేరిట కేసీఆర్ (నగర మరియు పట్టణ మరియు పల్లె ప్రాంతాలను కలుపుకుని) లక్ష కోట్ల పంపిణీ కి సిద్ధం అయ్యా రు. ఉత్తినే డబ్బులు పంచుతారా అని విమర్శలు రావడంతో తర్వాత వాటిని సద్వినియోగం చేయించే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. అంటే ఒక్కో లబ్ధిదారునికి పది లక్షల చొప్పున వేయాలని, వాటిని యూనిట్ల ఏర్పాటు కు మాత్రమే వెచ్చించాలని సూచించారు. కానీ ఇప్పటిదాకా కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లోనే ఈ పథకం అమల్లో ఉంది. అది కూడా కలెక్టర్ గైడ్ లైన్స్ పాటించే వారికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. యూనిట్ల కొనుగోలులో కలెక్టర్ గైడ్లైన్స్ బాగున్నా, వాళ్లు విధించే నిబంధనల పాటింపు అన్నది లబ్ధిదారులకు సాధ్యమా ? అన్నదే ఓ పెద్ద ప్రశ్న. అందుకే యూనిట్ల ఎంపిక చాలా ఆలస్యం అవుతుంది కూడా !
ఏపీతో పోలిస్తే పథకాల అమలులో వెచ్చింపులో కేసీఆర్ కొంత ఆర్థిక క్రమశిక్షణతోనే ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. మరీ ! ఇబ్బడిముబ్బడిగా అయితే డబ్బులు పంచడం లేదు కానీ.. ఇక్కడ కూడా నిధుల దుర్వినియోగం అయితే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. వాటిని నిలువరించి పథకాలను అమలు చేయడం అంత సులువు కాదు. ఈ విషయంలో ఏపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు.
ఏపీ అయినా టీజీ అయినా సంక్షేమం విషయంలో కాస్త అతి చొరవ తగ్గించుకుని అవసరం మేరకే పథకాల ప్రకటన కానీ అమలు కానీ వర్తింపు కానీ చేస్తే ఆర్థిక రంగం అన్నది సంక్షోభంలో చిక్కుకోదు. అలా చేయకపోతే మిగిలేది అప్పులే. మళ్లీ వాటిని కట్టాల్సింది ప్రజలే. ఇక్కడ ఎనిమిదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు కూడా భారీగానే ఉంది.. నాలుగు లక్షల కోట్లు దాటి ఆయన సర్కారు చేసిన అప్పు ఉందని తెలుస్తోంది.
మరి ! మిగులు నిధులతో భారీ అంచనాలతో ఏర్పాటయిన బంగారు తెలంగాణకు అప్పులేంటి అని మాత్రం అడగకండి. ఈ విషయంలో ఏపీ సంగతి సరే సరి! కానీ ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణ సర్కారు కూడా సంక్షేమంపై ప్రేమ పెంచుకుని మరిన్ని పథకాలు కనుక ఎన్నికల దృష్ట్యా ప్రవేశపెడితే ఏపీ మాదిరిగానే ఇంకా నిండా మునగడం ఖాయం. కనుక ఏపీ అయినా టీజీ అయినా కాస్త ఆలోచనకు, సహేతుక ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వడం ఇవాళ అత్యవసరం. ఆవశ్యకం కూడా!