Begin typing your search above and press return to search.

జయలలిత దారిలో కేసీఆర్

By:  Tupaki Desk   |   18 July 2015 6:42 AM GMT
జయలలిత దారిలో కేసీఆర్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బాటలో సాగేలా కనిపిస్తున్నారు. జయలలిత మాదిరిగానే ఆయన కూడా క్యాంపు కార్యా లయం నుంచి విధులు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అత్య వసర పరిస్థితుల్లో తప్ప మిగతా రోజుల్లో బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయం నుంచే పాలన సాగించాలని ఆయన సంకల్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా సచివాలయానికి ప్రతిరోజూ రారు. ఆయా శాఖల సమీక్షలు, పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలను క్యాంపు కార్యాలయంలోనే నిర్వహిస్తారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే పంథా అనుసరించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సచివాలయానికి వెళ్ళకుండా సమీక్షలు, ముఖ్య సమావేశాలను క్యాంపు కార్యా లయంలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధానం కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు.

అత్యవసర సమయాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు తాను ఉంటున్న అధికార నివాసం నుంచి జరిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన శాఖ అధికారులను కోరినట్లు సమాచారం. వీడియో కాన్ఫరెన్స్‌లను నిర్వహించే అవ కాశం క్యాంపు కార్యాలయంలో ఉన్నప్పటికీ ఇందుకు సంబంధించిన పరికరాలు క్యాంపు కార్యాలయానికి ఆనుకుని ఉన్న మరో భవనంలో ఉండటంతో సాధ్యపడటం లేదని తెలుస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బస చేసి అధికారిక కార్యాలయాన్ని ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ కేవలం క్యాంపు కార్యాలయంలో నివాసాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. సీఎం కార్యాలయంలో అడుగుపెట్టడానికి ఆయన అయిష్టతను వ్యక్తం చేశారు. ఈ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లు, పాత్రికేయుల సమావేశాలను నిర్వహించేందుకు అన్ని హంగులు ఉన్నాయి.

సీఎంను కలిసేందు కు జిల్లాల నుంచి సందర్శకులు, పార్టీ కార్యాకర్తలు, ముఖ్య నేతలు వచ్చినా వారు వేచి ఉండేందుకు ఈ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం కార్యాలయంలో పని చేసే ప్రత్యేక కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు ఈ భవనంలో ప్రత్యేకంగా కార్యాలయాలను కూడా గతంలోనే అందు బాటులోకి తెచ్చారు. సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం అధికార నివాసాన్ని ఉపయోగిస్తుండటంతో ఎక్కువ మంది అధికారులతో సమావేశాన్ని నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఇంట్లో సీఎం కూర్చునే కార్యాలయంలో 20కన్నా ఎక్కువ మందితో సమావే శాలు జరపాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి సమావే శాన్ని సచివాలయంలోనే ఏర్పాటు చేయాల్సి వస్తోంది. లేని పక్షం లో ఆరుబయట ఉన్న పచ్చిక బైళ్లలో అధికారులతో సమీక్షలు, సమావేశాలు జరపవలసిన పరిస్థితి ఏర్పడింది.

కాగా కేసీఆర్ గత 12 రోజులుగా సచివాలయానికి రాకుండా ముఖ్యమైన సమావేశాలను, సమీక్షలను నివాసంలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు సంబంధించి జరిగిన చర్చలను సైతం క్యాంపు కార్యాలయంలోనే నిర్వహిం చారు.