Begin typing your search above and press return to search.

కేసీఆర్ పండ‌గ గిఫ్ట్ అదిరిపోతుంద‌ట‌

By:  Tupaki Desk   |   2 July 2017 4:27 AM GMT
కేసీఆర్ పండ‌గ గిఫ్ట్ అదిరిపోతుంద‌ట‌
X
సంక్షేమ కార్య‌క్ర‌మాలు పాల‌కుల‌కు స‌రికొత్త ఇమేజ్‌ ను క‌ట్ట‌బెడ‌తాయ‌న్న విష‌యం తెలిసిందే. వినూత్నంగా ఉండ‌టంతో పాటు.. వీలైనంత ఎక్కువ మంది ఈ సంక్షేమ కార్య‌క్ర‌మాల ప‌రిధిలోకి తీసుకురావ‌టం.. ప‌ప్పు బెల్లాల మాదిరి కాకుండా ప‌నికొచ్చేలా బ‌హుమ‌తులు ఇవ్వ‌టం ఇటీవ‌ల కాలంలో పెరిగింది. స‌ర్కారు ఇచ్చిందంటే ఏదో నామ్ కే వాస్తి అన్న‌ట్లు కాకుండా గ్రాండ్ గా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం క‌నిపిస్తుంది.

త‌మ‌ది ధ‌నిక రాష్ట్రమ‌ని.. త‌ర‌చూ చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఇటీవ‌ల కాలంలో గురి చూసి మ‌రీ గిఫ్టులు ఇవ్వ‌టం క‌నిపిస్తోంది. కోట్లాది మేక‌ల్ని ఉచితంగా ఇవ్వ‌టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని గొర్రెల పెంప‌కందారుల్ని ల‌క్షాధికారుల్ని చేయ‌ట‌మే కాదు.. వేలాది కోట్ల రూపాయిల సంప‌ద‌ను సృష్టించ‌నున్న‌ట్లుగా చెప్ప‌టం తెలిసిందే.

ఇలాంటి సంక్షేమ కార్యక్ర‌మాల‌తో పాటు.. మ‌రో అదిరిపోయే ప్లాన్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు భారీ ఎత్తున జ‌రుపుకునే ద‌స‌రా పండ‌క్కి పేద‌లు ఉక్కిరిబిక్కిరి అయ్యే బ‌హుమానాన్ని అందివ్వాల‌ని డిసైడ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. బ‌తుక‌మ్మ‌.. ద‌స‌రా పండగ‌ల‌కు క‌లిపి.. తెలంగాణ రాష్ట్రంలోని పేద‌ల‌కు కొత్త వ‌స్త్రాల్ని పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇప్ప‌టికే రంజాన్‌.. క్రిస‌మ‌స్ సంద‌ర్భంగా ఆయా వ‌ర్గాల పేద‌ల‌కు ఉచితంగా వ‌స్త్రాలు ఇస్తున్న కేసీఆర్ స‌ర్కారు.. ఈసారి పెద్ద పండ‌క్కి రాష్ట్రంలోని పేద‌లంద‌రికి కొత్త వ‌స్త్రాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు. తాజాగా తీసుకున్న‌ట్లుగా చెబుతున్న ఈ కానుక కార‌ణంగా రాష్ట్ర ఖ‌జానాపై రూ.1200 నుంచి రూ.1500 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు కానుంద‌ని చెబుతున్నారు.

పండ‌క్కి పేద‌ల‌కు కొత్త వ‌స్త్రాలు ఇవ్వ‌నున్న ఈ ప‌థ‌కంతో కేసీఆర్ స‌ర్కారు రెండు విధాలుగా లాభ‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. చేనేత వ‌ర్గాల ద‌గ్గ‌ర నుంచి పెద్ద ఎత్తున ఈ వ‌స్త్రాల్ని కొనుగోలు చేయ‌నున్నార‌ని..దీంతో ఆ వ‌ర్గానికి ఉపాధిని ఇవ్వ‌టంతో పాటు.. ఆ వ‌స్త్రాల్ని పేద‌ల‌కు అందించ‌టం ద్వారా వారిలోనూ సంతోషాన్ని నింపే ఆలోచ‌న‌లో కేసీఆర్ స‌ర్కారు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

బ‌తుక‌మ్మ చీర‌ల పేరుతో పండ‌క్కి పంపిణీ చేసే ఈ ప‌థ‌కం రాష్ట్రంలోని మ‌హిళ‌ల మ‌న‌సు దోచుకోవ‌టం ఖ‌య‌మంటున్నారు. కొత్త బ‌ట్ట‌ల ప‌థ‌కంలో దాదాపు 3 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు లబ్ది చేకూర‌నుంద‌ని చెబుతున్నారు. స‌ద్దుల బ‌తుక‌మ్మకు ఒక్క రోజు ముందుగా గ్రామాల్లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించి మ‌రీ కొత్త వ‌స్త్రాల్ని అందించాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే ఇంత భారీగా చేస్తున్న కార్య‌క్ర‌మాలు.. ఎన్నిక‌ల వేళ అధికార‌పార్టీకి మ‌రింత మైలేజీని ఇస్తాయ‌న‌టంలో సందేహం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఖ‌జానాకు భారీగా భార‌మైనా.. ప్ర‌భుత్వానికి వ‌చ్చే మైలేజీ ముందు ఈ భారం ఒక లెక్కా ఏంది?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/