Begin typing your search above and press return to search.
కలిసి రాని చోట ప్రచారమేంది కేసీఆర్?
By: Tupaki Desk | 17 Oct 2019 5:54 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయనకు ఉండే నమ్మకాల గురించి తప్పనిసరిగా ప్రస్తావించకుండా ఉండలేరు. మరి.. అలాంటి సారూ.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటాన్ని విశేషంగా చెబుతున్నారు. సెంటిమెంట్లను పక్కాగా ఫాలో అయ్యే కేసీఆర్.. తాజాగా తన హుజూర్ నగర్ పర్యటన సందర్భంగా నమ్మకాన్ని పక్కన పెట్టేయటం కనిపిస్తుంది. అదే సమయంలో.. తనకున్న నమ్మకాల విషయాన్ని ఆయన మర్చిపోయారా? అన్న సందేహం కలుగక మానదు.
మొదట్లో విజయం తమదేనన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తమకు అనుకూలంగా రానుందన్న మాటను టీఆర్ ఎస్ నేతలు పలువురు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే.. అనూహ్యంగా మారిన పరిస్థితులు.. తెర మీదకు వచ్చిన ఆర్టీసీ సమ్మె వ్యవహారం.. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలకు పాల్పడటం.. సెంటిమెంట్ మరింతగా ముదిరిపోవటంతో పాటు.. ఎన్నికల సంఘం డేగచూపుతో కేసీఆర్ అండ్ కో ఆగమాగం అవుతున్నట్లు చెబుతున్నారు.
కాలు కదిపితే చాలు.. ఎన్నికల సంఘం అలెర్ట్ అయిపోతున్నారని.. చిన్నచిన్న ఖర్చులు పెట్టాలంటే కూడా భయపడాల్సి వస్తోందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటివేళ.. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి హుజూర్ నగర్ వచ్చిన కేసీఆర్ స్థానికంగా ఉన్న రామస్వామి గుట్ట వద్ద ప్రచారం చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుపొందినా.. అక్కడ ఓడిపోవటంతో.. ఆ వేదిక కలిసి రాలేదన్న మాట వినిపిస్తోంది.
తాజాగా అదే వేదిక మీద నుంచి కేసీఆర్ ప్రసంగించటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైన వేళ.. వేదిక ఎంపిక విషయంలో కేసీఆర్ తన సెంటిమెంట్ ను భిన్నంగా వ్యవహరించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరీసారైనా భిన్నమైన ఫలితం వస్తుందా? గత ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందా? అన్నది కాస్త వెయిట్ చేస్తే సరిపోతుంది.