Begin typing your search above and press return to search.
మన ప్రచారం.. బాబు కు అనుకూలం!
By: Tupaki Desk | 5 Feb 2019 7:39 AM GMT“ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో మేము వేలు పెడతాం. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం చేశారు కదా. మేం ఏపీలో చేస్తాం. చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.” ఈ మాటలు అన్నది ఎవరో ఈపాటికి తెలిసే ఉంటుంది. అవును... మీరు ఊహించింది నిజమే. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ మాటలు అన్నారు. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనుకూలంగా ప్రచారం చేయాలని కెసిఆర్ నిర్ణయించారు. జాతీయస్థాయిలో ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా తన కుమారుడు కే తారకరామారావు ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పంపారు. అంతేకాదు తన అనుంగు అనుచరుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను కూడా ఆంధ్రప్రదేశ్ కు పంపించారు. అక్కడ తాము ప్రచారం చేస్తామని - తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు రిటర్న్ గిఫ్ట్ తప్పదని ప్రకటించారు. అయితే పరిస్థితి విరుద్ధంగా మారింది అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఓ నాయక బృందాన్ని ఏపీ పంపించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పర్యటించిన ఆ నాయకులు నివేదిక ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారం చేస్తే అది వికటిస్తుందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ ముందస్తు ఎన్నికల లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఒకవేళ ఏపీలో జగన్ కు అనుకూలంగా టిఆర్ ఎస్ ప్రచారం చేస్తే అది చంద్రబాబునాయుడు అనుకూలంగా మారుతుందని - జగన్ కు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు లేవని తమ అధినేత కెసిఆర్ కు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఏపీలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడు కి కలిసి వస్తుందంటే అక్కడ ప్రచారం చేయడం అనవసరమని కొందరు సీనియర్ నాయకులు కెసిఆర్ తో అన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం పై తెలంగాణ రాష్ట్ర సమితి మల్లగుల్లాలు పడుతున్నట్టు చెబుతున్నారు.