Begin typing your search above and press return to search.
కేసీఆర్ సారుకు ఎంత ఎనర్జీ? జ్వరం వచ్చిన పక్కరోజున అంతలా తిరిగారే
By: Tupaki Desk | 8 Feb 2022 4:30 AM GMTజ్వరం వస్తే ఎలా ఉంటుంది? ఒంట్లో ఒపిక మొత్తం లాగేసినట్లుగా ఉంటుంది. అందులోకి.. వచ్చింది సామాన్యమైన జ్వరం కాదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చిన వేళలో.. ఆయన్నురిసీవ్ చేసుకోవటానికి.. వీడ్కోలు పలికేందుకు సైతం ఒపిక లేని పరిస్థితి. అలాంటిది.. జ్వరం వచ్చిన పక్కన రోజునే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకున్న యాదాద్రి టూర్ లో ఆయన నడకలోని వేగం.. గంటల పాటు ఆలయం చుట్టూ బొంగరంలా తిరిగిన ఒపిక చూస్తే.. నోట మాట రాదంతే.
వచ్చే నెల (మార్చి) 28న యాదాద్రి ఆలయ ఉద్ఘాటనను భారీగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించటం తెలిసిందే. ఈ కార్యక్రమాల్ని చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని డిసైడ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ కార్యక్రమానికి గట్టిగా నెలన్నర మాత్రమే ఉన్న నేపథ్యంలో.. జరుగుతున్న పనులను సమీక్షించటం కోసం సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 1.38 గంటల వేళలో యాదాద్రికి చేరుకున్నరు. కట్ చేస్తే.. రాత్రి ఎనిమిది గంటల వరకు నాన్ స్టాప్ గా పనులు జరిగిన తీరుపైనా.. వచ్చే నెలలో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్ల మీద వరుస పెట్టి రివ్యూ నిర్వహించారు.
అంతేకాదు.. ఆలయం చుట్టూ పలుమార్లు తిరగటమే కాదు.. ప్రతి అంశాన్ని లోతుగా.. సునిశితంగా పరిశీలిస్తూ.. పలు ఆదేశాల్ని జారీ చేశారు. యాదాద్రి కొండపైన అమర్చుతున్న సప్తరాజగోపురాలపై ఉండే సువర్ణ కలశాల ఏర్పాటుతో పాటు.. ప్రస్తుతానికి మిగిలి ఉన్న పనుల మాటేమిటి? అని ప్రశ్నించారు. మరో ఐదు రోజుల్లో మరోసారి యాదాద్రి వస్తానని చెప్పిన ఆయన.. అప్పటికి పలు పెండింగ్ పనులు పూర్తి కావాలని ఆదేశించారు.
గడువు లోపు పనులన్నీ పూర్తి చేయాలని.. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు నిర్వహించే మహాసుదర్శన యాగానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. యాగశాల నిర్వహణ కోసం సుమారు 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. లక్షల్లో భక్తులు వస్తారని.. అందుకు అనుగుణంగా సదుపాయాలు చేయాలన్న కేసీఆర్.. 1108 కుండాలతో.. ఆరు వేల మంది రుత్విక్కులు.. నాలుగు వేల మంది సహాయకులు యాగం చేస్తారని.. అందుకే.. యాగశాల ఏర్పాట్లతో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
యాగశాల వద్ద ఎనిమిది రోజుల పాటు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి పక్కా ఏర్పాట్లు చేయాలన్న కేసీఆర్.. ధ్వజ స్తంభం.. బలిపీఠాలు.. విమాన గోపురాలకు బంగారు తాపడటానికి చేపట్టాల్సిన పనులు మరింత వేగవంతం చేయాలన్నారు. మొత్తంగా జ్వరం వచ్చిన పక్క రోజున అన్నేసి గంటలు పని చేసిన కేసీఆర్ ను చూసినప్పడు ఈ వయసులోనూ ఎంత ఒపిక అనుకోకుండా ఉండలేని పరిస్థితి.