Begin typing your search above and press return to search.
అచ్చం చంద్రబాబులానే.. కేసీఆర్ కు అనుభవం
By: Tupaki Desk | 6 Nov 2021 3:39 PM GMTచరిత్ర కొన్నిసార్లు తిరిగి జరుగుతుందంటారు.. అది వ్యక్తిగత విషయాల్లో అయినా, రాజకీయాల్లో అయినా అంతే. ఇప్పుడిదే ఉదాహరణ తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలోనూ నిజమనిపిస్తోంది. తెలంగాణ సాధకుడిగా చరిత్రలో నిలిచిపోయిన కేసీఆర్ కు ప్రస్తుతం రాజకీయంగా క్లిష్ట కాలం నడుస్తోంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబును ఎదిరించి.. సొంతంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట పార్టీని నెలకొల్పి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న కేసీఆర్ తెలంగాణ సాధించి విమర్శకుల నోళ్లు మూయించారు. అంతేకాక తనదైన వ్యూహంతో చాకచక్యంగా వ్యవహరించి.. కాంగ్రెస్ కౌగిలిలో చిక్కుకోకుండా, ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి అధికారం చేజిక్కించుకున్నారు. అనంతరం మరింత దూకుడుగా ముందుకెళ్తూ, ప్రజాభిమానం చూరగొన్నారు. ప్రతిపక్షాలకు చుక్కలు చూపుతూ చావు దెబ్బకొట్టారు. 2014 నుంచి 2019 వరకు ఏ ఉప ఎన్నికలోనూ ప్రతిపక్ష పార్టీలు గెలవలేదంటేనే కేసీఆర్ హవా ఏ స్ధాయిలో సాగిందో తెలిసిపోతోంది.
మరిప్పడు ఏం జరుగుతోంది?
వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతోకొంత వ్యతిరేకత సహజం. ఏడాది కాలంగా అదే కనిపిస్తోంది. 2020 చివర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెనుకబడింది. అయితే, పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నిలో గెలిచి లెక్క సరిచేసింది. కానీ, తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిలో దారుణంగా ఓడిపోయింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, మందీ మార్బలాన్ని ఉపయోగించినా గెలవలేకపోయింది. అన్నిటికి మించి.. కేసీఆర్ పట్టుబట్టి సాగనంపిన ఈటల రాజేందర్ గెలుపును అడ్డుకోలేకపోవడం టీఆర్ఎస్ కు అవమానకరమే. ఈ పరిణామాలన్నీ చూస్తే 2001 నాటి విషయాలు గుర్తు రాకమానవు.
సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇలా..
ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కేసీఆర్ 2001లో నాటి సీఎం చంద్రబాబుతో విభేదించి సొంత పార్టీ పెట్టుకుని, సిద్దిపేట ఉప ఎన్నికలో గెలిచారు. అచ్చం ప్రస్తుతం కేసీఆర్ చేసినట్టే నాడు చంద్రబాబు చేశారు. కేసీఆర్ ఓటమికి శక్తినంతా ప్రయోగించి విఫలమయ్యారు. ఆ తర్వాత నుంచి చంద్రబాబు ప్రభుత్వానికి గడ్డు కాలం సాగింది. చివరకు 2004 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. వైఎస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని.. చంద్రబాబు పరాజయంలో కేసీఆర్ తనదైన పాత్ర పోషించారు. ఇప్పుడు దాదాపు అదే తరహాలో టీఆర్ఎస్ నుంచి గెంటివేతకు గురైన ఈటల తన మాజీ బాస్ పై ప్రతీకారం తీర్చుకున్నారు. బండి సంజయ్ సారథ్యంలో దూకుడు మీదున్న బీజేపీలో చేరి కేసీఆర్ కు సవాల్ విసరడమే కాక హుజూరాబాద్ లో విజయఢంకా మోగించారు. మొత్తంగా చూస్తే.. నాడు చంద్రబాబు-కేసీఆర్ మధ్య ఏం జరిగిందో, ఇప్పుడు కేసీఆర్-ఈటల నడుమ అదే జరిగింది. ఇక మిగిలింది 2023 అసెంబ్లీ ఎన్నికలు. అప్పటికి ప్రతిపక్షాలు ఏం చేస్తాయో..? కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు పన్నుతారో..? ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.
ప్రజల్లోనూ ఆలోచన
ఉప ఎన్నికలో ఓటమి సంగతి అటుంచి మరోవైపు సమాజంలో ఒక్కొక్కటిగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందా? అన్న అనుమానం కలుగుతోంది. ప్రలోభాలు, ఒత్తిళ్ళు, బదిలీలు, పంపిణీలు, పదవులు, పథకాలు ఇలా ఎన్ని ప్రకటించినా ఓటమి మాత్రం తప్పలేదు. దీన్నిబట్టి చూస్తే కేసీఆర్ చర్యలను ప్రజలు బాగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగాల భర్తీకి డిమాండ్ మొదలైంది. ఉద్యమం పేరుతో ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా పెద్ద ఉద్యమం ప్రారంభం కానుంది. 20 విద్యార్ధి సంఘాలు జేఏసీగా ఏర్పడి ఇందుకు సిద్ధమవుతున్నాయి. మలి దశ ఉద్యమం అంత ఉవ్వెత్తున సాగిందంటే దానికి ఓయూనే కారణం. అలాంటిచోట నుంచే మళ్లీ ఉద్యోగాల భర్తీకి ఉద్యమం మొదలవడం కొంత చర్చనీయాంశమే.